జగన్ రెడ్డికి తీన్మారేనా? రఫ్పాడిస్తున్న రఘురామ.. 

Publish Date:Jun 5, 2021

Advertisement

ర‌ఘురామ‌. వీడు మామూలోడు కాదురా బాబూ అని జ‌గ‌న్‌రెడ్డి త‌ల ప‌ట్టుకుంటున్నారట. అన‌వ‌స‌రంగా ఎందుకు పెట్టుకున్నామా అని తెగ బాధ‌ప‌డుతున్నారట.. ర‌చ్చ‌బండ‌తో రాజీ ప‌డితే.. ఢిల్లీ స్థాయిలో డ్యామేజీ జ‌రిగేది కాదుగా అని వెక్కి వెక్కి ఏడుస్తున్నారట.. వీడియోల‌తోనే వాడిని వ‌దిలేస్తే.. పార్ల‌మెంట్ స్థాయిలో ప‌రువు పోయేది కాదుగా అని నిద్ర‌లేని రాత్రులు గుడుపుతున్నారట. ర‌ఘురామ అనే పేరు వింటేనే.. జ‌గ‌న్‌రెడ్డి ఉలిక్కిప‌డుతున్నాడరట‌. ఎవ‌రైనా కాంప్ర‌మైజ్ చేస్తే బాగుండంటూ క‌నిపించిన వారిన‌ల్లా వేడుకుంటున్నారట‌. ఇది కాస్త వెట‌కార‌మే అయినా.. ర‌ఘురామ కౌంట‌ర్ అటాక్‌తో గొడ్డుకారం తిన్న వాడిలా త‌యారైంది జ‌గ‌న్‌రెడ్డి ప‌రిస్థితి అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. అవును మ‌రి, ర‌ఘురామ ఎదురుదాడి మామూలుగా లేదు. సుప్రీంకోర్టు, పార్ల‌మెంట్‌, ఎన్‌హెచ్ఆర్‌సీ.. ఇలా దేనినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. త‌న‌కు జ‌రిగిన దారుణంపై, త‌న‌పై జ‌రిపిన థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగంపై.. ఢిల్లీ స్థాయిలో జ‌గ‌న్‌రెడ్డితో చెడుగుడు ఆడుకుంటున్నారు. ర‌ఘురామ‌. ఇక త‌న అరెస్టులో పాత్ర‌ధారులు, సూత్ర‌ధారులైన ప్ర‌తీ ఒక్క‌రినీ.. పేరు పేరుగా శిక్షిస్తున్నారు. గుంటూరు అర్బ‌న్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఆర్మీ హాస్పిట‌ల్ రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి, ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డి.. ఇలా ఏ ఒక్క రెడ్డినీ వ‌ద‌ల‌డం లేదు ర‌ఘురామ‌. రాజు గారి దెబ్బ‌కు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది చాలామందికి.

ఇంట్లోకి చొర‌బ‌డి అరెస్ట్ చేశామా! క‌స్ట‌డీలో కుమ్మేశామా! జైల్లో పెట్టి మూసేశామా! అంతే. క‌ట్టె.. కొట్టె.. తెచ్చె. ఇంతే సింపుల్ అనుకున్నారు. ర‌ఘురామ ఖేల్ ఖ‌తం.. వీడియోల‌ దుకాణం బంద్ అనుకున్నారు. కానీ, మొండిఘ‌టం ర‌ఘురామ ఆ త‌ర్వాత జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు చుక్క‌లు చూపిస్తారని ఆ స‌మ‌యంలో వారికి తెలీదు. సుప్రీంకోర్టులో పోరాడి మ‌రీ బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఢిల్లీ ఎగిరిపోయి.. ఇక అక్క‌డి నుంచి అస‌లైన ఆట మొద‌లుపెట్టారు. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. వీల్‌చెయిర్‌లో వెళ్లి మ‌రీ ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు క‌లిశారు. సీఐడీ క‌స్ట‌డీలో త‌న‌ను కొట్టిన తీరును క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించారు. లోక్‌స‌భ స్పీక‌ర్‌ను క‌లిశారు. కాలి గాయాల‌ను చూపించారు. ఎంపీ అయిన త‌న‌పై జరిగిన దాడిని పార్లమెంటుపై జరిగిన దాడిగానే పరిగణించాలని కోరారు. జాతీయ మ‌న‌వ హ‌క్కుల సంఘాన్నీ ఆశ్ర‌యించారు. త‌న‌ను దారుణంగా కొట్టి.. మాన‌వ హ‌క్కుల‌ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు. ఇలా.. త‌న‌పై ఏపీ ప్ర‌భుత్వం జ‌రిపిన అమానుషంపై దేశ అత్యున్న‌త‌ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌న్నింటి దృష్టికీ తీసుకెళ్లారు ర‌ఘురామ‌. జ‌గ‌న్‌రెడ్డిని ఢిల్లీ స్థాయిలో దోషిగా నిల‌బెట్టారు. 

అక్క‌డితో ఆగలేదు ర‌ఘురామ‌. పార్లమెంటు న్యాయ, ప్రజా ఫిర్యాదుల స్థాయీ సంఘం చైర్మన్ భూపేంద్రయాదవ్‌తో పాటు.. వివిధ పార్టీల‌కు చెందిన‌ స‌హ‌చ‌ర పార్ల‌మెంట్ స‌భ్యుల‌కూ లేఖ రాశారు. త‌న‌ను సీఐడీ క‌స్ట‌డీలో ఎలా కొట్టింది.. త‌న‌పై రాజ‌ద్రోహం కేసు పెట్టి ఎలా హింసించిందీ.. అంతా పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రిస్తూ తోటి ఎంపీల‌కు లేఖ రాశారు. దెబ్బ‌ల‌తో క‌మిలిన త‌న కాలి గాయాల ఫోటోల‌నూ లేఖ‌కు జ‌త చేశారు. ఆ ఫోటోలు చేసి.. ఆ లేఖ చ‌దివి.. స‌హ‌చ‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు అవాక్క‌వుతున్నారు. ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఒక గౌర‌వ ఎంపీ ప‌ట్ల‌.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తుందా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

జగన్‌పై 11 సీబీఐ, 6 ఈడీ కేసులున్నాయని, వాటిలో జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నారని, జగన్ తో పాటు కేసులు ఎదుర్కొంటున్నవారు జగన్ మంత్రివర్గంలో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని తాను సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేసినందుకే త‌న‌ను ఇలా హింసించార‌ని లేఖలో వివ‌రించారు ర‌ఘురామ‌. ఆయ‌న‌ రాసిన లేఖ‌, పంపిన ఫోటోల‌ను.. త‌మ అధికారికి సోష‌ల్ మీడియా వాల్స్‌పై పోస్ట్ చేస్తున్నారు. ర‌ఘురామ‌కు సంఘీభావం వ్య‌క్తం చేస్తున్నారు ప‌లువురు ఎంపీలు. ర‌ఘురామ‌పై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు చేసిన దారుణాల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా దుయ్య‌బ‌డుతున్నారు. 

ఏపీలో హిట్ల‌ర్ రాజ్య‌మా? అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు  తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్. సైద్ధాంతికంగా తాను రఘురామతో విభేదిస్తానని, కానీ ఒక పార్లమెంటేరియన్‌ పట్ల ఈ విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య రాజకీయ కార్యకర్తల మాటేమిటి?ఏపీ ప్రభుత్వ క్రూరత్వానికి ఇది నిదర్శనమంటూ ట్వీట్ చేశారు మాణికం ఠాగూర్‌. 

క‌ర్ణాట‌కకు చెందిన ఎంపీ హేమ‌ల‌త అంబ‌రీష్‌.. శివ‌సేన‌కు చెందిన ప్రియాంక చ‌తుర్వేది.. ఇలా అనేక మంది ఏపీ ప్ర‌భుత్వ తీరును సోష‌ల్ మీడియాలో నిప్పుల‌తో క‌డిగేస్తున్నారు.

అనేక మంది ఎంపీల పోస్టుల‌తో.. ఈ రాష్ట్రం, ఆ పార్టీ అనే తేడా లేకుండా.. యావ‌త్ దేశానికి ఇప్పుడు ర‌ఘురామ ఎపిసోడ్ చేరింది. దేశ‌ ప్ర‌జ‌లంద‌రి ముందు జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం దోషిగా నిల‌బ‌డింది. ఒక ఎంపీని కొట్టిన వైనం.. ఆయ‌న కాలికి అయిన గాయాల ఫోటోలు చూసి.. పార్ల‌మెంట్ స‌భ్యులంతా ఉలిక్కిప‌డుతున్నారు.  ఒక ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డం ఏంట‌ని.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తీరుపై మండిప‌డుతున్నారు. ప్ర‌స్తుతానికి సోష‌ల్ మీడియాలోనే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని శిక్షిస్తున్న ఎంపీలు.. రాబోవు పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అస‌లైన శిక్ష విధించ‌డానికి.. ఏపీ స‌ర్కారును పార్ల‌మెంట్ కోర్టులోకి లాగేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే త‌న‌కు న్యాయం చేయ‌మంటూ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు ర‌ఘురామ‌. మ‌రోవైపు, ఎంపీలంతా ముక్త‌కంఠంతో ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. తాజా వ్య‌వ‌హారంపై కేంద్రం సైతం ఆగ్ర‌హంగా ఉంది. అటు, జాతీయ మాన‌వ‌ హ‌క్కుల సంఘం సైతం విచార‌ణ ప్రారంభించింది. వ‌రుస ప‌రిణామాలు చూస్తుంటే.. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎంపీ ర‌ఘురామ‌పై జ‌రిగిన దాడి వ్య‌వ‌హారం ప్ర‌ధాన ఎజెండాగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు పార్ల‌మెంట్ క‌న్నెర్ర‌కు గురికాక త‌ప్ప‌దు. వెయిటింగ్ ఇక్క‌డ అంటూ.. ర‌ఘురామ ఢిల్లీలో కూర్చొని.. తొడ‌గొట్టి స‌వాల్ విసురుతుంటే.. ఏపీలో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారులో ద‌డ మొద‌లైంది.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.