డ్రగ్స్ టెస్ట్‌లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు పాజిటివ్‌

Publish Date:Mar 15, 2026

Advertisement

 

డ్రగ్స్ టెస్ట్‌లో  ఎంపీ పుట్ట మహేశ్‌కుమార్ పాజిటివ్‌ వచ్చింది . రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ఫామ్‌ హౌస్‌లో జరిగిన డ్రగ్స్  కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాత్రి నుండి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రెస్ పార్టీలో నువ్వే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీలో దొరికిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు అయితే అందులో ఐదుగురికి మాత్రం పాజిటివ్ రాగా మరికొందరికి నెగటివ్ వచ్చింది. 

దీంతో పోలీసులు మరోసారి 11మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్‌కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా మహేష్ కుమార్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. అయితే మహేష్ కు మొదట నిర్వహించిన యూరిన్ టెస్ట్‌లో మాత్రం నెగిటివ్ వచ్చింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి మరోసారి బ్లడ్ టెస్ట్ నిర్వహించారు.ఈవిచారణలో భాగంగా యూరిన్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. నీళ్లు కలపడం వల్లే యూరిన్ టెస్ట్‌లో డ్రగ్స్ నెగిటివ్‌గా వచ్చినట్లు తేల్చారు. 

బ్లడ్ టెస్ట్‌లో మాత్రం మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. వీకెండ్ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మొయినా బాద్‌లోని తన ఫామ్‌ హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ పార్టీలో వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పోలీసులు సేకరించిన ఆధారాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి అనుమతుల ప్రక్రియను మరింత సరళీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు
ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
టి20చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌పై 1,000 పరుగుల మార్కును చేరుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ రికార్డు పుటల్లోకెక్కారు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా తన బ్యాట్‌తో పరుగుల వరద పారించడం తనకు అలవాటేనని ఈ ఘనతతో మరోసారి నిరూపించుకున్నాడు.
ఖాకీ చొక్కా వెనుక ఉన్న అవినీతి కోణం మరోసారి బయటపడింది.
నగరంలోని ప్రముఖ ఆర్థిక హబ్‌లలో ఒకటైన బేగంపేటలోని యాక్సిస్‌ బ్యాంక్‌ శాఖలో భారీ కుంభకోణం వెలుగుచూసింది.
ఈ కేసులో విచారణను నిలిపివేయడానికి, ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరిస్తూనే.. లాలూ ప్రసాద్ యాదవ్ వయస్సును, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోనికి తీసుకున్న సుప్రీం కోర్టు ఆయనకు ట్రయల్ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన తల్లి–ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా చోటుచేసుకుంది
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని వినిపించారు.
కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు.
అట్లాంటిక్ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న ఈ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ట్రంప్ దెబ్బతీశారని, ఆయన నిర్ణయాలు కూటమి పతనాన్ని శాసించాయని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేవలం ఒక వ్యక్తి ప్రమేయం కంటే లోతైన వ్యవస్థాగత కారణాలు ఉన్నాయన్నది ప్రపంచ మేధావులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి.. అమెరికాలో యూరప్ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి ట్రంప్ ఒక ప్రతినిధిగా నిలిచారే తప్ప.. పూర్తిగా ఆయన వల్లే ఈ పరిస్థితి వచ్చిందనడం సరికాదని వారి అభిప్రాయం.
దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను ట్రంప్ దెబ్బతీశారన్నది వారి ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది. అయితే.. ఈ అభిప్రాయం పూర్తిసత్యమా? లేక దీని వెనుక మరింత లోతైన వాస్తవం దాగి ఉందా?
ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల దెబ్బతిన్న తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇరాన్ శ్రమిస్తోంది. ఈ వ్యూహాత్మక సరఫరా గొలుసులో పాకిస్తాన్ పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. చైనా నుంచి ఇరాన్‌కు అందుతున్న క్షిపణి సాంకేతికత, ఆయుధ సంపత్తికి పాకిస్తాన్ ఒక ట్రాన్సిట్ పాయింట్‌ అంటే రవాణా మార్గంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.