జీహెచ్ఎంసీలో దోమల ఫాగింగ్‌లో భారీ స్కామ్

Publish Date:Feb 24, 2026

Advertisement

 

హైదరాబాదు నగరంలో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న ఫాగింగ్ కార్యక్రమంలో భారీ అవినీతి వ్యవహారం బట్టబయలు అయింది. మల్కాజిగిరి సర్కిల్‌లో ఫాగింగ్ సిబ్బంది మధ్య పంపకాల విషయం లో తలెత్తిన విభేదాల కారణంగా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజూ ఫాగింగ్ కోసం కేటాయించే డీజిల్‌ను పూర్తిగా వినియోగించ కుండా, పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతు న్నాయి.అధికారికంగా మల్కాజిగిరి సర్కిల్‌కు రోజుకు 84 లీటర్ల డీజిల్ కేటాయిస్తుండగా, వాస్తవంగా కేవలం 24 లీటర్లతో మాత్రమే ఫాగింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. 

మిగిలిన డీజిల్‌ను పెట్రోల్ బంక్‌లకు లీటర్‌కు పది రూపాయల కమీషన్ ఇచ్చి విక్రయించి, ఆ డబ్బులను ఎంటమాలజీ విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది స్వాహా చేసినట్లు సమాచారం. ఫాగింగ్ పనులు నిర్వహించే కార్మికులకు ప్రతినెలా ఐదు వేల రూపాయలు ఇచ్చి మిగతా మొత్తాన్ని సూపర్వైజర్, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) స్థాయి అధికారుల మధ్య పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఫాగింగ్ సిబ్బందికి ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేసిన లావాదేవీలు కూడా బయటపడినట్లు తెలిసింది. 

విషయం బయటకు రావడంతో సంబంధిత సూపర్వైజర్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. అయితే అవినీతి వ్యవహారాన్ని బయటపెట్టిన ఫాగింగ్ కార్మికుడిని ఇతర సిబ్బంది, ఎంటమాలజీ అధికారులు బెదిరించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సంవత్సరం దోమల నియంత్రణకు బల్దియా సుమారు రూ.32 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, నిధులు పక్కదారి పడుతున్న కారణంగా నగరవాసులు దోమల బెడద నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. 

డీజిల్ దుర్వినియోగం జరుగుతోందని గుర్తించిన అధికారులు గత మూడు నెలలుగా డీజిల్‌లో మెలాథియన్ రసాయనం కలిపి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీంతో డీజిల్‌ను విక్రయించే అవకాశం లేకపోవడంతో కొంతమంది సిబ్బంది ఫాగింగ్ చేయకుండా డ్రైనేజీల్లో పారబోస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో బల్దియా వర్గాల్లో కలకలం రేగింది. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో దోమల నియంత్రణకు ఖర్చు చేస్తున్న భారీ నిధులు నిజంగా వినియోగం అవుతున్నాయా అనే అంశంపై కూడా  సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

By
en-us Political News

  
ప్రస్తుత తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు వృద్ధిని కాపాడుకుంటూనే, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ఆర్‌బీఐ ముందున్న ప్రధాన సవాలు.
భారత ఆర్థిక వ్యవస్థకు బలం ఇచ్చేది దేశీయ వినియోగం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, గత కొన్ని సంవత్సరాల్లో బలపడ్డ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు. 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6శాతం వృద్ధి తరువాత కూడా, భారత్ బలమైన స్థితిలోనే ప్రపంచ అనిశ్చితిలోకి ప్రవేశిస్తోందని అధ్యయనం పేర్కొంది.
కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.తన విధ్వంసకర బ్యాటింగ్ తో 18 ఏళ్ల రికార్డును సమం చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాలుగు వరుస పరాజయాల తరువాత తొలి గెలుపును అందుకుంది. ఈ విజయం జట్టు సమష్టి ప్రదర్శనతో లభించింది.
అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు, . సెల్లార్‌లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడ భద్రపరిచిన పాత సోఫాలు, ఇతర గృహోపకరణాల అంటుకుని క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.
ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బంది సహాయంతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి.
లోకేష్ పొరబాటున ఒక తల్లిగా భావించి విజయమ్మ పుట్టిన రోజుకు ఒక ట్వీట్ పెట్టిన పాపానికి అది అటు దిరిగి ఇటు దిరిగి ఎన్నో వివాదాలకు కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.