టారిఫ్ లతోనే అమెరికాకు ఆదాయం.. ట్రంప్

Publish Date:Feb 24, 2026

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తన ట్రంపరి తనంతో అమెరికాను ఒంటరిని చేయడం విషయంలో వడివడిగా  అడుగులేస్తున్న ట్రంప్.. తాజాగా అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ మరో సారి తన ప్రభుత్వ విధానాలపై విస్పష్ట ప్రకటన చేశారు. అదలా ఉంచితే.. ఆయన ప్రసంగం ఆద్యంతం  మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సాగింది.

  ట్రంప్   టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన  నేపథ్యంలో..  ట్రంప్ సర్కార్ ట్రేడ్ యాక్ట్ 1974లోని మరో సెక్షన్‌ను ఉప యోగించి అన్ని దేశాల దిగుమతులపై   15 శాతం గ్లోబల్ టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. తన తాజా ప్రసంగంలో ఆ నిర్ణయాన్ని సమర్ధించుకున్న ట్రంప్   ట్రంప్ అమెరికా పౌరులపై ఆదాయపు పన్ను భారం తగ్గించి విదేశీ దిగుమతులపై సుంకాల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలన్నది తన లక్ష్యమని చెప్పారు.  

ట్రంప్   15 శాతం గ్లోబల్ టారిఫ్ 150 రోజుల పాటు  అమల్లో ఉంటుంది. ఆ తర్వాత దీనిని పొడిగించాలంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. దీంతో అమెరికన్లకు ఇన్ కం టాక్స్ ఎత్తివేస్తానంటూ ప్రకటించడం ద్వారా గ్లోబల్ టారిఫ్ కు కాంగ్రెస్ మద్దతు పొందాలన్న లక్ష్యంతో ట్రంప్ ఉన్నారని అవగతమౌతున్నది. అలాగే ఇరాన్ పై సైనిక చర్యకు వెనుకాడబోనంటూ ట్రంప్ చేసిన ప్రకటన కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. మొత్తం మీద ట్రంప్ సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించైనా సరే తన టారిఫ్ టెర్రర్ ను కొనసాగించే ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన తాజా ప్రసంగం స్పష్టం చేసింది. 

By
en-us Political News

  
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది.
హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం ఎక్సైజ్ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి.
జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఒక హృద్యమైన సంఘటన అందరి మనసులను తాకింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది.
ప్రముఖ కన్వెన్షన్ వ్యాపారవేత్త శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు.
ప్రస్తుత తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు వృద్ధిని కాపాడుకుంటూనే, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ఆర్‌బీఐ ముందున్న ప్రధాన సవాలు.
భారత ఆర్థిక వ్యవస్థకు బలం ఇచ్చేది దేశీయ వినియోగం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, గత కొన్ని సంవత్సరాల్లో బలపడ్డ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు. 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6శాతం వృద్ధి తరువాత కూడా, భారత్ బలమైన స్థితిలోనే ప్రపంచ అనిశ్చితిలోకి ప్రవేశిస్తోందని అధ్యయనం పేర్కొంది.
కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.తన విధ్వంసకర బ్యాటింగ్ తో 18 ఏళ్ల రికార్డును సమం చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాలుగు వరుస పరాజయాల తరువాత తొలి గెలుపును అందుకుంది. ఈ విజయం జట్టు సమష్టి ప్రదర్శనతో లభించింది.
అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు, . సెల్లార్‌లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడ భద్రపరిచిన పాత సోఫాలు, ఇతర గృహోపకరణాల అంటుకుని క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.
ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బంది సహాయంతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.