మోడీ టార్గెట్ కవిత!

Publish Date:Jun 28, 2023

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ మరో సారి అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఆయన భోపాల్ లో చేసిన ప్రసంగం మొత్తం విపక్షాలే అవినీతికి పాల్పడుతున్నాయని ఎలుగెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విషయాన్నీ ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో మంత్రులు, పార్టీ నేతలూ మాత్రం పులికడిగిన ముత్యాలని చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగ సారాంశమేమిటంటే.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారంతా అవినీతి పరులేనని, అలాంటి వారెవరైనా బీజేపీలో చేరితే వారి పాపాలూ, అవినీతి అక్రమాలన్నీ.. గంగలో మునిగితే పాపాలు పోయినట్లు మాయమైపోయి పునీతులౌతారని అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ  తెలంగాణ ఆవల తొలి సారిగా బీఆర్ఎస్ అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణంలో ఎదుర్కొంటున్న ఆరోపణలను ప్రస్తావించారు.  ఈడీ, సీబీఐ నజర్ లో ఉన్న సంగతి ఎత్తి చూపారు. అంతే కాదు తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన కొనసాగాలని కోరుకునే వారు మాత్రమే బీఆర్ఎస్ కు ఓటు వేయాలనీ, స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన కావాలనుకుంటే బీజేపీకి ఓటేయండి అని పిలుపు నిచ్చారు.  మోడీ భోపాల్ పర్యటన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ల ప్రారంభం కోసం.. సరే ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. మోడీ  ఆ రాష్ట్రంలో సమస్యలు, అక్కడి రాజకీయాల గురించి ప్రస్తావిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ మధ్యప్రదేశ్ గడ్డ మీద నుంచి ఆయన తెలంగాణలో అవినీతి సర్కార్ అంటూ ఆక్షేపించారు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెపై కేసుల గురించీ, ఆరోపణల గురించీ కూడా చెప్పారు. అక్కడ నుంచి తెలంగాణ ప్రజలను బీజేపీకి ఓటేయాల్సిందిగా కోరారు. సరే ఆవిషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ప్రధాని మోడీ గంపగుత్తగా  విపక్ష పార్టీలన్నీ అవినీతి పార్టీలే అని ప్రకటించేసి... బీజేపీకి క్లీన్ చిట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని బీజేపీలో చేర్చుకుని వారికి క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా కమలం పార్టీ మొత్తం అవినీతి రహిత పార్టీ అని ప్రధాని ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలకు విపక్ష నేతలపై దర్యాప్తు చేయడం వినా మరో పని లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. సంక్షేమం పేరుతో విపక్షాలు అవినీతికి గ్యారంటీ ఇస్తుంటే.. తాను, తన సర్కార్  మాత్రం అవినీతి పరులకు శిక్షలు వేయించడానికి గ్యారంటీ ఇస్తున్నట్లు ఘనంగా ప్రకటించుకున్నారు. ఇక్కడే అవినీతి ఆరోపణలకు ఎదుర్కొంటూ బీజేపీ గూటికి చేరి హఠాత్తుగా పునీతులైపోయిన నేతల గురించి  మోడీ ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన సొంత నేతల్నే జైలుకు పంపిన రికార్డు ఉంది కానీ.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం  మాత్రం సొంత పార్టీ నేతల అవినీతిని పట్టించుకోవడం లేదు. అంతే కాదు అలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుటన్నవారు కమలం గూటికి చేరగానే  క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నది. గతంలో కాంగ్రెస్  హయాంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలపై అధికార పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తూ సుప్రీం కోర్టే  గతంలో సీబీఐని పంజరంలో చిలుకగా అభివర్ణించింది. ఇప్పుడు మోడీ హయాంలో అయితే  కేంద్ర దర్యాప్తు సంస్థలు మరబొమ్మలుగా మారిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం కీ ఇస్తే కదులుతున్నాయి. లేకపోతే ఆగిపోతున్నాయి. మోడీ భోపాల్ వేదికగా ప్రస్తావించిన కల్వకుంట్ల కవిత వ్యవహారమే తీసుకుంటే.. కేసీఆర్ కేంద్రం మీద విరుచుకుపడుతూ.. మోడీపై విమర్శలు గుప్పించినంత కాలం మద్యం కుంభకోణంలో కవిత విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు యమా స్పీడుగా వ్యవహరించాయి. ఇహనో, ఇప్పుడో కవిత అరెస్టు తథ్యం అనిపించేలా హడావుడి చేశాయి. హస్తినకు పిలిపించుకుని మరీ ఈడీ విచాణ చేసింది. ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకుంది. పలువురిని అప్రూవర్లుగా మార్చి మరీ కవితను టార్గెట్ చేసింది.

ఎప్పుడైతే కేసీఆర్  కేంద్రంపై విమర్శలకు విరామం ప్రకటించారో.. ఆ వెంటనే కవిత విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు సైలెంట్ అయిపోయాయి. ఈ తొమ్మిదేళ్లుగా మోడీ సర్కార్ అవినీతినై ప్రకటించిన యుద్ధం అంతా ఇలానే సాగింది. గత ఎన్నికలకు ముందు అప్పటి తెలుగుదేశం నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను దర్యాప్తు సంస్థలు ముప్పుతిప్పలు పెట్టాయి. ఎప్పుడైతే వారిరువురూ తెలుగుదేశం వీడి కమలం గూటికి చేరారో అప్పటి నుంచి వారిపై అవినీతి మరక లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంగతి ఎంత తక్కువ చెబితే అంత మంచిది.  

అందుకే మోడీ అవినీతిపై పోరాటం అంటూ ఇస్తున్న నినాదాలను ప్రజలు విశ్వసించడం మానేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్నాటక ఫలితం ఇదే తెల్చి చెప్పిందని అంటున్నారు. విపక్షాల మీద విమర్శలు గుప్పించే మోడీ సర్కార్ కర్నాటకలో కమిషన్ల సర్కార్ అంటూ ఎదుర్కొన్న విమర్శల గురించి మాత్రం పన్నెత్తి మాట్లాడటం లేదెందుకని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. 

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.