డీజే మోతకు కూలిన స్లాబ్ పెచ్చులు.. నిద్రలో ఉన్న చిన్నారులకు తీవ్ర గాయాలు.!

Publish Date:Oct 23, 2026

Advertisement

దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని పెద్దకోడూరు గ్రామంలో చోటుచేసుకుంది.  బాధితుడు కొనింటి శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున శ్రీహరి తన భార్య పల్లవి, కుమారుడు మనస్తిత్, కూతుళ్లు వివేక, స్వాతితో కలిసి తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. 

అదే సమయంలో గ్రామంలో వీధుల్లో మారుమోగిన భారీ డీజే సౌండ్ తీవ్రమైన ప్రకంపనలను సృష్టించింది. ఆ తీవ్రమైన శబ్ద తరంగాల ధాటికి దెబ్బతిన్న పాత ఇందిరమ్మ ఇల్లు ఒక్కసారిగా కదిలిపోయి, స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులపై పెచ్చులు పడటంతో తీవ్ర ప్రమాదం సంభవించింది. కుమారుడు మనస్తిత్, కూతురు వివేకలకు తీవ్ర గాయాలు కాగా, శ్రీహరితో పాటు మిగతా కుటుంబ సభ్యులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. తెల్లవారుజామున జరిగిన ఈ అనూహ్య ప్రమాదంతో ఇంట్లో ఒక్కసారిగా హాహాకారాలు చెలమెత్తాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను రక్షించి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం అక్కడ వారికి వైద్య చికిత్స కొనసాగుతోంది. గ్రామాల్లో పండుగలు, ఉత్సవాల పేరిట రాత్రింబవళ్లు విపరీతమైన శబ్దాలతో మోగే డీజేల కారణంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెవిలో హోరెత్తించే డీజేల ఏర్పాటుపై అధికారులు ఉక్కుపాదం మోపాలని, ఇకపై ఇలాంటి వాటికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ప్రజలు గట్టిగా కోరుతున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. పండుగలు, ఊరేగింపుల పేరుతో అధిక శబ్దంతో డీజేలు మోగించడం ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా ప్రమాదాలకు కూడా కారణమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శబ్ద కాలుష్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

 

 

[ DJ sound accident, Medak news, Peddakodur incident, slab collapse, Telangana news, DJ sound vibration injury,  Telangana Police, DGP C.V.Anand, Devi navaratrulu, Telugu News, Telugu One ]


 

By
en-us Political News

  
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.