భోపాల్ లో కవితపై మోడీ విమర్శల ఆంతర్యమేమిటంటే?

Publish Date:Jun 29, 2023

Advertisement

ప్రధాని మోడీ ఉన్నట్లుండి.. కేసీఆర్ కుటుంబంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదీ తెలంగాణ గడ్డ మీద నుంచి కాదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ వేదికగా ప్రధాని మోదీ  కేసీఆర్ కుటుంబపాలనపై చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ బీజేపీలో కొత్త చర్చకు దారి తీశాయి. పార్టీలో ఉండాలా? వద్దా? అని లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్న వారిలో పునరాలోచన రేపాయి. మోదీ వ్యాఖ్యలు నమ్మాలా? వద్దా?  మోడీ నిజంగా కవితపై చర్యలు తీసుకునేందుకే   ఆ వ్యాఖ్యలు చేశారా?   మోడీ వ్యాఖ్యలలో సీరియస్ నెస్ ఉందా?  పార్టీ మారే విషయంలో మరికొంత కాలం వేచిచూద్దామా? అని రాష్ట్ర బీజేపీలో అసంతృప్తులు మీమాంసలో పడ్డారు.

 తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి. ప్రజలు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయండ ని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొనసాగాలా? నిష్క్రమించాలా? సరైన సమయంలో కాంగ్రెస్‌లోకి వెళ్లాలా? అని సందిగ్ధంలో ఉన్న సీనియర్లను మరింత గందరగోళంలో పడేశాయనడంలో సందేహం లేదు.

అసలు ప్రధాని   భోపాల్ వేదికగా తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? అన్న చర్చ  బీజేపీలో విస్తృతంగా సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులు నమోదై, విచారణ కూడా జరిగింది. అయినా ఆమెను ఇప్పటివరకూ అరెస్టు చేయకుండా, కేవలం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పావులు కదుపుతుండటాన్ని, తెలంగాణ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ముంగిట.. బీజేపీ, బీఆర్ఎస్ లాలూచీ అన్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు. కేవలం క విత విషయంలో బీజేపీ హైకమాండ్ తీరు కారణంగానే బీజేపీకి రాష్ట్రంలో వచ్చిన హైప్ బుడగలా పేలిపోయింది. మద్యం కుంభకోణం కేసు నుంచి కవితను రక్షించేందుకే ఏపీ సీఎం జగన్ ద్వారా శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మర్చడంలో బీజేపీ అగ్రనాయకత్వం పాత్ర, ప్రమేయం ఉందని రాష్ట్ర బీజేపీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు.

ఏపీలో అవినాష్ రెడ్డిని  ఏ విధంగా అయితే అరెస్టు కాకుండా అడ్డుపడుతోందో, తెలంగాణలో కవితను కూడా బీజేపీ అగ్రనాయకత్వం అలాగే కాపాడుతోందని సామాన్య జనమే కాదు, తెలంగాణ బీజేపీలో పలువురు నేతలు, శ్రేణులూ కూడా భావిస్తున్నాయి.  ఆ కారణంగానే తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజలలో విశ్వసనీయత తగ్గిందనీ, గత నాలుగున్నరేళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకాన్ని బీజేపీ అగ్రనాయకత్వం చేజేతులా వమ్ము చేసిందని పార్టీలోని ఒక వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ విషయంలో అగ్రనాయకత్వం ఎలా వ్యవహరించినా ఫరవాలేదనీ, ఎందుకంటే అక్కడ పార్టీ నామమాత్రమేననీ, కానీ తెలంగాణలో మాత్రం పార్టీకి గట్టి పట్టు ఉందనీ, ప్రజలు కూడా బీజేపీకి ఓ చాన్స్ ఇచ్చి చూద్దాం అనే భావనలో ఉన్నారనీ వారంటున్నారు. అయితే మద్యం కుంభకోణంలో కవితకు బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్రం కొమ్ముకాసేలా వ్యవహరిస్తుండటంతో కేసీఆర్ పాలనను వ్యతిరేకించే వారి ఆప్షన్ గా ఇంత కాలం ఉన్న బీజేపీ ఇప్పుడు వెనుకబడిపోయిందనీ, ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చి చేరిందని చెబుతున్నారు.  కవిత  అరెస్టు కారన్న బలమైన భావన  ప్రజలలో ఏర్పడిందనీ,  ఇక బీఆర్‌ఎస్‌పై తాము చేసే పోరాటాలను, ప్రజలు ఎందుకు విశ్వసిస్తారని తెలంగాణ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నాయి. 

కేసీఆర్-కవితను జైలుకు పంపిస్తామని ఇప్పటికి కొన్ని వందల సార్లు హెచ్చరించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఆధారాలుంటే కచ్చితంగా అరెస్టు చేస్తారని మాటమార్చడంపై  పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇంత కాలం ఎలాంటి ఆధారాలు లేకుండా కవితపై తెలంగాణ బీజేపీ ఆరోపణలు గుప్పించిందా అని ప్రజలు నిలదీస్తుంటే ఏం సమాధానం చెప్పుకోవాలని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాల వద్ద ఇదే విషయాన్ని ఈటల, కోమటటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ప్రస్తావించారని అంటున్నారు.  కవిత విషయంలో కేంద్రం తీరు కారణంగా  బీజేపీ, బీఆర్‌ఎస్ పరస్పర విమర్శలు రాజకీయ డ్రామాగానే ప్రజలు భావిస్తున్నారని వారు కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీని బతికించుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోడీ భోపాల్ వేదికగా కవితపై ఆరోపణలను ప్రస్తావించారని పరిశీలకులు అంటున్నారు.  భోపాల్‌లో బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదు. అక్కడ ఆ పార్టీ ఉనికే లేదు. పోనీ  మధ్యప్రదేశ్ లో బీఆర్‌ఎస్‌ను విమర్శించడం వల్ల అక్కడ ఓట్లు పడతాయా అంటే అదీ లేదు.  ఏరకంగా చూసినా మోడీ వ్యాఖ్యలు బీజేపీకి ఇసుమంతైనా ఉపయోగపడవు. అదే సమయంలో బీఆర్ఎస్ కు వీసమెత్తు నష్టం జరగదు.  కేవలం కేంద్రం- పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న.. తెలంగాణ బీజేపీ నేతలను సంతృప్తిపరిచేందుకే, మోడీ  కవిత పేరు ప్రస్తావించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.