ముంబైలో మహిళపై ఎంఎన్ ఎస్ దాడి
Publish Date:Sep 1, 2022
Advertisement
రాజకీయపార్టీలు తమ ప్రచారంలో భాగంగా రోడ్లకి అడ్డంగానో, పక్కనో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టడం మామూలే. కానీ ప్రజలకు ఇబ్బంది లేనంతవరకే. తాము బలవంతులమని అతిగా వ్యవహరించడం ప్రజలు సహించరు. ముంబైలో అదే జరిగింది. కానీ పోలీసులు, ఆ ప్రాంతంవారూ పట్టనట్టే ఉండడం విచిత్రం. ముంబైలో ముంబా దేవి ప్రాంతంలోని తన మందుల దుకాణం ముందు ప్రచార స్తంభాన్ని, బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయవద్దని మహిళ మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలను కోరింది. రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ ఎస్)కార్యకర్తలు ఒక మహిళను నెట్టడం చెప్పుతో కొట్టడం చూపించే వీడియో వైరల్ అయ్యింది. ప్రకాష్ దేవి అనే మహిళ ఆగస్ట్ 28న వినోద్ అర్గిలే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ కార్యకర్తలు ప్రచారబోర్డుల కోసం స్తంభాన్ని ఏర్పాటుచేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వీడియోలో, కొంతమంది మిస్టర్ ఆర్గిల్‌ను దూరంగా లాగడం కనిపించింది, కానీ అతను దాడి చేయడం, కొట్టడం, నెట్టడం కొనసాగించాడు, ఆ సమయంలో ఆమె వీధిలో పడిపోయింది. 80-సెకన్ల క్లిప్‌ను వీడి యో చూపింది. దారిలో వెళ్లేవారు జోక్యం చేసుకోలేదు. ఏమీ పట్టనట్టే సినిమా చూసినట్టు చూశారు. కానీ ఎవ్వరూ అడ్డుకోలేదు. ఆలయానికి ప్రసిద్ధి చెందిన ముంబా దేవి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు వెదురు స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు, అయితే ప్రకాష్ దేవి తన మందుల దుకాణం ముందు వాటిని ఏర్పాటు చేయవద్దని చెప్పారు. తనపై శారీరకంగా దాడి చేయడమే కాకుండా, ఎంఎన్ఎస్ కార్యకర్తలు వినోద్ ఆర్గిల్ నాయ కత్వంలో విరు చుకుపడి, తనపై కూడా దుర్భాషలాడారని ఆమె ఆ తర్వాత చెప్పారు. దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఆగస్టు 31న ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించామని, త్వరలో చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురించి ఎంఎన్ ఎస్ పార్టీ అధినేత రాజ్ థాక్రే ఎలాంటి ప్రకటనా చేయలేదు.
http://www.teluguone.com/news/content/mns-followers-attack-on-woman-in-mumbai-25-143061.html





