ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి విందు...30 వేల మంది అతిథులు
Publish Date:Dec 23, 2025
Advertisement
మధ్యప్రదేశ్ సాంచీ ఎమ్మెల్యే ప్రభు రామ్ చౌదరీ తన కొడుకు పెళ్లి విందు అత్యంత వైభవంగా నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు పర్వ్ చౌధరీ వివాహం ఇటీవల జరిగింది. దానిని భోపాల్‌లో సింపుల్‌గా నిర్వహించారు. రిసెప్షన్ కోసం మాత్రం భారీగా ఏర్పాట్లు చేశారు. అందుకోసం రాయ్‌సెన్‌లో ఎనిమిది ఎకరాల్లో వేదిక వేశారు. వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 30 వేల మంది అతిథులు హాజరయ్యారు. 1000 మంది వంటవాళ్లు దేశీ, విదేశీ వంటకాలను సిద్ధం చేశారు. రాజస్థాన్ నుంచి కళాకారులు.. సంప్రదాయ సంగీతాన్ని వినిపించారు. రాయ్‌సెన్‌లో ఈ స్థాయి వేడుక ఎన్నడూ జరగలేదని స్థానికులు వెల్లడించారు. అయితే ఈ వ్యయంతో ఒక చిన్నపాటి ప్రాజెక్ట్ నిర్మించివుండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు సీఎం మోహన్ యాదవ్ చిన్న కుమారుడు డాక్టర్ అభిమన్యు పెళ్లి సాధారణంగా జరిగింది. ఉజ్జయినిలో పెళ్లి చేసుకున్నారు. బాబా రామ్‌దేవ్ మంత్రాలు చదువుతుండగా.. పూల దండలు మార్చుకుని.. చాలా సింపుల్‌గా ఈ తతంగాన్ని ముగించారు. వీరితో పాటు మరో 21 జంటలు ఇదే ముహూర్తంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఎలాంటి కానుకలు, హంగూ, ఆర్భాటాలు లేకుండా ఈ తంతు ముగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎమ్మెల్యే పెళ్లి విందులో కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీశ్ దేవ్డా, మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ఇతర సీనియర్ నేతలు వేడుకలో పాల్గొన్నారు
http://www.teluguone.com/news/content/mla-son-wedding-reception-36-211462.html





