అత్తాపూర్‌లో హిట్ అండ్ రన్ … ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
Publish Date:Dec 23, 2025
Advertisement
హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అత్తాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం వాహనం కారణంగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మృతుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ గుర్తిం చారు. అబ్దుల్ సత్తార్ అనే వ్యక్తి టౌలీచౌకి పోలీస్ స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈరోజు ఇతను తన విధులు ముగించు కుని బైక్‌పై ఇంటికి తిరిగి బయలుదేరగా టౌలీచౌకి నుంచి అత్తాపూర్ వైపు ప్రయాణి స్తున్నాడు. ఈ క్రమంలోనే అత్తాపూర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ వద్దకు రాగానే బైక్ ను వెనుక నుంచి ఒక డీసీఎం వాహనం అత్యంత వేగంగా వచ్చ ఢీ కొట్టింది. ఢీకొట్టిన వేగానికి బైక్ అదుపు తప్పగా, డీసీఎం చక్రాల కింద పడి కానిస్టేబుల్ పడిపోవడంతో అతని పైనుండి డీసీఎం వాహనం చక్రాలు వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ ఆగకుండా వాహనంతో సహ అక్కడి నుంచి పరార య్యాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి డీసీఎం వాహనాన్ని వెంబడించారు. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడిన స్థానికులు చివరకు డ్రైవర్‌ను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కానిస్టేబుల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీఎం డ్రైవర్‌పై హిట్ అండ్ రన్ కేసుతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడిపిన అభియో గాల కింద చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
http://www.teluguone.com/news/content/attapur-hit-and-run-36-211466.html





