జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దేవుడి దయతో కోలుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన గోపీనాథ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. నిపుణులైన వైద్యలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంటారని హారీశ్‌రావు తెలిపారు. మాగంటి త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తారని ఆశిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతు గోపీనాథ్ కోలుకుంటున్నారని గోపీనాథ్ వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. ఇటీవల బోరబండకు చెందిన బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు మహ్మద్ సర్దార్ ఆత్మహత్య ఘటనతో మాగంటి ఒత్తిడికి గురయ్యారన్నారు.
48గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని వివరించారు. మాగంటి గోపీనాథ్‌కు సీనియర్ వైద్యులు చికిత్స అందిస్తున్నారని, క్షేమంగా బయటికొస్తారనే విశ్వాసం ఉందన్నారు. 48 గంటల తర్వాత వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని తెలిపారు. అయితే ఆయన వెంటీలేటర్ పై చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన బంధువులు పేర్కొన్నారు. ఆయన అనారోగ్యంపై వస్తున్న వందతులను కొట్టిపారేశారు. గోపీనాథ్ కు ఐసీయూలో 48 గంటల అబ్జర్వేషన్ కొనసాగుతోందని, ఆయన చనిపోయారంటూ వస్తున్న వార్తలు అసత్యం అన్నారు.దయచేసి అలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరారు. మరోవైపు గోపీనాథ్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు ఆసుపత్రికి చేరుకొని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-maganti-gopinath-39-199395.html
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి.
ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్ రోకోకు ఆమె పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు.
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ పడిపోయింది.
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్రపంచంలో ఉన్న ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఆయనకా క్రెడిట్ దక్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మస్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్దరూ ఇపుడు కలిసిపోయారా?
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.