ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణం.. కుండ బద్దలుకొట్టిన పేర్ని
Publish Date:Jan 16, 2026
Advertisement
గత ఎన్నికలలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణమని మాజీ మంత్రి వైసీపీ అధినేత పేర్ని నాని కుండబద్దలు కొట్టేశారు. ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం చెప్పారు. ఇక 2029 ఎన్నికలలో విజయం కోసం జగన్ పాదయాత్రకు సిద్ధమౌతున్నారని చెప్పారు. ఔను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. 2029 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర @ 2.0 కు రెడీ అవుతున్నారంటూ అందుకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైందన్నారు పేర్ని నాని. వచ్చే ఏడాది అంటే 2027లో పార్టీ ప్లీనరీ తరువాత జగన్ తన పాదయాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. అయితే జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా పాలనలో వైఫల్యం చెందిందన్న పేర్ని నాని, వాటి నుంచి ఏం నేర్చుకున్నాం, మరో సారి అధికారంలోకి వస్తే ఆ పాలనా వైఫల్యాలను అధిగమించి జనరంజకమైన పాలనను ఎలా అందిస్తామన్న విషయాలను మాత్రం చెప్పలేదు. అయితే వైసీపీ అధినేత జగన్ ఇప్పటికీ తాము అద్భుత పాలన అందించామనీ, అయితే ఈవీఎంల టాంపరింగ్, చంద్రబాబు అసత్య ప్రచారాలే తమ ఓటమికి కారణమని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు పేర్ని నాని పాలనా వైఫల్యం అనడంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. ఈ ఏదాడిన్నర కాలంలో జగన్ చేపట్టిన కార్యక్రమాలంటూ ఏవీ లేవనే చెప్పాలి. తన ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, దోపిడీ ఆరోపణలతో అరెస్టైన వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులకు అడపాదడపా ఖండనలు, లేదా జైలు పరామర్శలకే జగన్ పరిమితమయ్యారు. అటువంటి జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటూ జనంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దానిపై పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఏడాది కిందటే.. అంటే 2025 జనవరిలోనే జిల్లా పర్యటనలు సహా కార్యక్రమాలను ప్రకటించారు. తాను స్వయంగా వాటికి నేతృత్వం వహిస్తానని ప్రకటించారు. అయితే ఆయనా ప్రకటన చేసి ఏడాది గడిచిపోయినా ఆయన అడుగు బయటపెట్టింది లేదు. బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ వైస్ వెర్సా అన్నట్లుగానే ఆయన పర్యటనలు సాగాయి. దీంతో జగన్ జనంలోకి అన్న మాటను పార్టీ నేతలూ, శ్రేణులే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని జగన్ పాదయాత్ర అంటూ చేసిన ప్రకటనను ఎవరు విశ్వసిస్తారన్న చర్చ జరుగుతోంది. ప్రకటనలే తప్ప ఆచరణ ఉండే అవకాశాలు మృగ్యమన్న వాదన వైసీపీ వర్గాల నుంచే వస్తున్నది. మరి చూడాలి జగన్ పాదయాత్రపై పేర్ని నాని ప్రకటిన ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో?
అది పక్కన పెడితే.. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలై, తెలుగుదేశం కూటమి ఘన విజయంతో అధికారపగ్గాలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నది. ఈ ఏడాదిన్నర కాలంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పూర్తి స్థాయిలో ప్రజలలోకి వచ్చింది లేదు. అసలాయన ఆంధ్రప్రదేశ్ కు రావడమే ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్లు వస్తున్నారు. వారంలో ఒక రోజు రాష్ట్రంలో ఇలా పర్యటించి అలా బెంగళూరు ప్యాలెస్ కు చెక్కేస్తున్నారు. అలా వచ్చినప్పుడు కూడా ప్రజలలోకి రావడం అత్యంత అరుదు. ఏదో అందుబాటులో ఉన్న, లేదా ఆయన ఎంపిక చేసుకున్న నేతలతో ఇన్ హౌస్ మీటింగ్ లకు పరిమితమౌతున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-governance-failures-are-the-reason-for-ycp-defeat-39-212586.html





