షేన్‌వార్న్ మృతి అనుమానాస్పదమా?.. థాయ్ పోలీసులు ఏమంటున్నారు?
Publish Date:Mar 5, 2022
Advertisement
షేన్‌వార్న్ అకాల మరణం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. జస్ట్ 52 ఏళ్లకే గుండెపోటుతో చనిపోవడం ఊహించని పరిణామం. క్రికెటర్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే వార్న్.. ఇలా హార్ట్ స్ట్రోక్‌తో పోవడం మామూలు విషయం ఏమీ కాదు. అయితే.. షేన్ థాయ్‌లాండ్ టూర్‌లో ఉండటం.. ఓ ప్రైవేట్ విల్లాలో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుండటం.. పార్టీలు, మజా మజాలు చేసుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే కాస్త డౌట్ వ్యక్తం చేస్తున్నారు కొందరు. పార్టీలో డ్రగ్స్ వాడారా? ఆ డోస్ ఏమైనా పెరిగుంటుందా? అని కూడా అనుమానిస్తున్నారు. షేన్‌వార్న్‌ను బతికించడానికి ముగ్గురు స్నేహితులు విశ్వ ప్రయత్నాలు చేశారని.. సుమారు 20 నిమిషాల పాటు అతడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని థాయ్‌లాండ్ పోలీసులు మీడియాకు చెప్పారు. వార్న్ కొద్ది రోజులుగా ముగ్గురు స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌లోని కోహ్ సామూయ్‌లోని ఓ ప్రైవేటు విల్లాలో బస చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. అతడు గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ‘షేన్‌వార్న్ భోజనానికి రాకపోవడంతో స్నేహితుల్లోని ఓ వ్యక్తి అతడి గదికి వెళ్లి చూడగా అప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే స్పందించిన ఫ్రెండ్స్.. వార్న్ గుండెపోటుకు గురై ఉంటాడని భావించి ఛాతి భాగంలో సుమారు 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆస్పత్రికి తరలించాక వైద్యులు మళ్లీ సీపీఆర్ నిర్వహించినా ఫలితం లేకపోయింది’ అని థాయ్‌లాండ్‌కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే, షేన్‌వార్న్ డ్రగ్స్ వాడారా? లేదా? అనే దానిపై ఇప్పటికైతే ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే ఆయనది గుండెపోటు వల్ల మరణమే.
http://www.teluguone.com/news/content/mistery-behind-shane-warne-death-25-132616.html





