కేంద్రంపై యుద్ధంలో మళ్లీ వెనకడుగు..
Publish Date:Mar 4, 2022
Advertisement
చివరాఖరుకు కేసీఆర్ కు తత్వం బోధపడినట్లుంది, గౌతమ బుద్ధినికి బోధి వృక్షం నీడలో జ్ఞానోదయం అయితే, బుద్దుని బోధనలకు పుట్టినిల్లుగా భావించే ఝార్ఖండ్’ (బీహార్)లో కేసీఆర్’కు తత్వం బోధ పడిందిలా వుంది. కాంగ్రెస్, బీజేపే వ్యతిరేక కూటమి ఏర్పాటు లక్ష్యంగా, ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి, పనిలో పనిగా ఝార్ఖండ్’ వెళ్ళారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన తండ్రి శిబూసోరెన్’తో కేసీఆర్ సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. సోరెన్ జూనియర్’తో కలిసి మీడియాతో సమవేశంలో మాట్లాడారు. ఎప్పటిలానే కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదని, దేశానికి ఇప్పుడు కొత్త అజెండా కావాలని పేర్కొన్నారు. అయితే, చివరాఖరులో, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా, ప్రస్తుతానికి ఎలాంటి, ఫ్రంట్ ఏర్పాటు చేయడం లేదని, తేల్చేశారు. అలాగని, ఆ ప్రయత్నాలకు స్వస్తి చెప్పామనీ చెప్పలేదు. ఒక బ్రేక్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే కేసీఆర్ మాట తీరు గమనిస్తే, ఆయన థర్డ్ ఫ్రంట్ ఆలోచనకు మరోమారు, మంగళం పాడేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. అలాగే,ఢిల్లీ వెళ్లేముందు బీజేపీ మీద కారాలు మిరియాలు నూరిన కేసీఆర్ ఝార్ఖండ్’లో మాత్రం, యాంటీ బీజేపీ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు బదులుగా దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నాలు జరగాలని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాధానం ఇచ్చారే, కానీ, కమల దళం పై మాములు స్టైల్లో కాలు దువ్వలేదు. అంతే కాదు అదే సమయంలో మరోమారు, ప్రస్తుతానికి ఎటువంటి ఫ్రంట్ లేదని స్పష్టం చేయడంతో పాటుగా, తాము ఎవరికీ అనుకూలం కాదని, అలా అని ప్రతికూలం కూడా కాదని పేర్కొన్నారు. అంటే, అది వ్యూహత్మకమే కావచ్చును కానీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రస్తుతానికి .. కేసీఆర్ యుద్ధం నుంచి బ్రేక్ తీసుకున్నారు, అనుకోవచ్చును, అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-takes-a-break-says-no-front-right-now-25-132611.html





