ఉక్రెయిన్ లో పౌర నౌకపై క్షిపణి దాడి.. నలుగురు ఇండియన్స్ సహా పలువురు మృతి.!

Publish Date:Jul 20, 2026

Advertisement

ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయం సమీపంలో నల్ల సముద్ర జలాల్లో  ధాన్యపు నిల్వలతో ప్రయాణిస్తున్న ఒక పౌర,  వాణిజ్య కార్గో నౌకపై జరిగిన  క్షిపణి దాడిలో   నలుగురు భారత నావికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో ఇండియన్ తీవ్రంగా గాయపడ్డారు.   పౌర రవాణా నౌకను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ ఘాతకం వెనుక రష్యా బలగాల ప్రమేయం ఉందంటూ ఉక్రెయిన్ ఆరోపించింది. 

టర్కీకి చెందిన   షిప్పింగ్ సంస్థ నిర్వహణలోని  గోల్డెన్ లియో  అనే బల్క్ క్యారియర్ నౌక, గినియా, బిస్సావ్ దేశ  పతాకంతో సముద్రంలో ప్రయాణిస్తోంది. జూలై 19 న ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మక ఒడెస్సా పోర్టు నుండి భారీగా ఆహార ధాన్యాల లోడుతో  బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక క్షిపణి దాడికి   ఆ సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

  సమాచారం అందుకన్న వెంటనే స్థానిక సహాయక బృందాలు, తీర రక్షణ బలగాలు రెస్క్యూ చర్యలు చేపట్టాయి. అయితే, దెబ్బతిన్న నౌక భాగాల మధ్య చిక్కుకుని నలుగురు ఇండియన్స్ తో  పాటు ఉక్రెయిన్‌కు చెందిన లోకల్ నెవిగేషన్ పైలట్, మరికొందరు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన వారిని  ఒడెస్సాలోని  క ఆసుపత్రికి తరలించారు.  ఈ విషాద ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.  ఉ మృతదేహాలను స్వదేశానికి తరలించే ప్రక్రియపై దృష్టి సారించినట్లు పేర్కొంది. 

పౌర వాణిజ్య నౌకపై జరిగిన ఈ   దాడిని ఇండియా ఖండించింది. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి, అంతర్జాతీయ నౌకాయానానికి విఘాతం కలిగిస్తూ  పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్ఘాటించింది. ఇటువంటి దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంటూ.. మృతి చెందిన నావికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి  తెలియజేసింది. 

Russia Ukraine war, Golden Leo  vessel, Indian sailors death , missile attack on Odesa port 

By
en-us Political News

  
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అహోరాత్రులు కష్టపడి రాసే నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భారీ సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏపీలో సంచలనం రేపిన మద్యం రవాణా టెండర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.