భోగాపురం భూ నిర్వాసిత రైతులకు చంద్రబాబు బంపర్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

Publish Date:Jul 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమై వచ్చే నెల 1న ప్రారంభోత్సవానికి ముస్తాబైన  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బంపర్ గిఫ్ట్ ప్రామిస్ చేశారు.  ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు.

ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాజధాని అభివృద్ధి, ప్రాంతీయ విమానాశ్రయాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్వాసితుల పాత్ర గుర్తింపునకు చంద్రబాబు నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుందని పరిశీలకులు అంటున్నారు.  విజయనగరం జిల్లా పరిధిలో రూపుదిద్దుకున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వచ్చే నెల 1న  ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.  

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న   నిర్ణయం ప్రకారం, భోగాపురం విమానాశ్రయ భూసేకరణ ప్రక్రియలో తమ పట్టా భూములను, సాగు భూములను అందించిన ప్రతీ ఒక్క   రైతు కుటుంబానికి ఈ వన్-టైమ్ ఫ్రీ ఫ్లైట్ జర్నీ సదుపాయం వర్తిస్తుంది. గతంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రాంతంగా ఉన్న తమ సొంత నేల నుంచి నేడు దేశ విదేశాలకు విమానాలు ఎగిరిపోతుంటే, ఆ ప్రయాణంలో తొలి భాగస్వాములుగా ఇక్కడి రైతులే ఉండాలనే ఉద్దేశంతో  చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పంట పొలాలు ఏ స్థలంలోనైతే ఉండేవో, అదే స్థలంలో రూపుదిద్దుకున్న రన్‌వే పైనుంచి విమానంలో నింగికి ఎగరడం రైతులకు ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక పాస్‌లు, ప్రయాణ మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడించనున్నారు.  

Bhogapuram Airport, CBN Free Air Travel, Bhogapuram Farmers

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అహోరాత్రులు కష్టపడి రాసే నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.