పొగాకుపై జీఎస్టీ తగ్గించండి.. నిర్మలా సీతారామన్‌కు ఏపీ నేతల విజ్ఞప్తి..!
Publish Date:Jul 21, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు నేతృత్వంలోని మంత్రులు, ఎంపీల బృందం ఈరోజు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారా మన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సమావేశంలో రాష్ట్రంలోని పొగాకు రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధుల బృందం, జీఎస్టీ రేటు పెంపు వల్ల ఎఫ్‌సీవీ (FCV) పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించింది. దీంతో రైతులతో పాటు డీలర్లు, ఎగుమతిదారులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ సందర్భంగా *ముడి పొగాకు (HSN 2401)*కు మాత్రమే సంబంధించినదని, తయారైన పొగాకు ఉత్పత్తులపై అమలులో ఉన్న పన్ను విధానానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గిస్తే రైతులకు గిట్టు బాటు ధరలు లభించే అవకాశాలు మెరుగుపడ టంతో పాటు, పొగాకు కొనుగోళ్లు, వ్యాపారం, ఎగుమతులు కూడా ఊపందుకుంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా జీఎస్టీ తగ్గింపు వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత ఎఫ్‌సీవీ పొగాకు పోటీతత్వం పెరిగి, ఎగుమ తులు మరింత వృద్ధి చెందే అవకాశం ఉంటుందని వివరించారు. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు పొగాకు సాగుపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ విజ్ఞప్తిని సాను కూలంగా పరిశీలించి, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ మంత్రులు, ఎంపీలు కోరారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బస్తీపాటి నాగరాజు, బీద మస్తానరావు తదితరులు పాల్గొన్నారు. Raw Tobacco, GST on Raw Tobacco, GST Reduction, Nirmala Sitharaman, Tobacco Farmers, Minister Kinjarapu Atchennayudu, CM Chandrababu, FCV, HSN 2401
http://www.teluguone.com/news/content/raw-tobacco-36-226625.html





