తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ : నారా లోకేశ్
Publish Date:May 27, 2025
Advertisement
తెలుగు జాతి కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కడపలో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడుతూ టీడీపీ అంటే పేదల పార్టీ అని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ముహుర్తం బలమైనదని ఈ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేసిందన్నారు. 40 ఏళ్లలో ఎన్నో ఒడుదోడుకులు ఎదుర్కొందని లోకేశ్ తెలిపారు. కార్యకర్తలు పసుపు జెండాను దించకుండా మోశారని వారందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని ఆయన అన్నారు. రాబోయే 40 సంవత్సరాల పాటు పార్టీని విజయవంతంగా నడిపించడానికి అవసరమైన అంశాలపై ఈ మహానాడు వేదికగా సమగ్రంగా చర్చించాలని పిలుపునిచ్చారు. "తెలుగు వారి కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి, అన్నదాతకు అండగా నిలిచిన పార్టీ మనది. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన ముహూర్త గట్టిదన్నారు. ప్రస్తుత పార్టీలో 58 మంది తొలిసారిగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మంది నూతన ఉపాధ్యాయులను నియమించబోతున్నామని ఆయన వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని, సొంత తల్లి, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని ఆయన అన్నారు. మాజీ మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపిస్తాన్నారు.. పంపించమని చెప్పాను రోజా పంపించే చీర, గాజులను మా అక్కచెల్లెళ్లకు పెట్టు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పాను లోకేశ్ తెలిపారు. మనకు ప్రతిపక్షం కొత్తకాదు.. అధికారం కొత్త కాదు. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నా. అవి 1. తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2. యువగళం, 3. స్త్రీశక్తి, 4. పేదల సేవల్లో సోషల్ రీఇంజినీరింగ్, 5. అన్నదాతకు అండగా, 6. కార్యకర్తలే అధినేత. అన్ని రంగాల్లో మన తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలి. పని చేసేవారిని ప్రోత్సహిస్తామని యువనేత తెలిపారు.
http://www.teluguone.com/news/content/minister-nara-lokesh-25-198768.html





