మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రూ.61 లక్షల నిధులు వెచ్చించి అన్న క్యాంటీన్ నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ముందుగా దుగ్గిరాల చేరుకున్న మంత్రి లోకేష్‌కు టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి అన్న క్యాంటీన్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్షయపాత్ర సిబ్బందితో కలిసి మంత్రి లోకేష్ సామాన్య ప్రజానీకానికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేసమనేని శ్రీ అనిత తదితరులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-lokesh-inaugurates-anna-canteen-in-duggira-36-215242.html
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.