ప్రజలకు మంత్రి ధర్మాన వార్నింగ్

Publish Date:Jun 29, 2023

Advertisement

పాపం వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరినట్లుంది.  లేకపోతే మళ్ళీ తమని గెలిపించకపోతే అంటూ ఏకంగా ప్రజలకే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. తాము ప్రజల కోసం చాలానే చేశామని చెప్పుకుంటున్న వైసీపీ వర్గాలు ఇప్పుడు ప్రతిపక్షాలు ఎండగట్టే వాటికి సమాధానం చెప్పుకోలేక ఇలా ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే పని మొదలు పెట్టినట్లున్నారు. అది కూడా ఏ గల్లీ లీడరో.. కొత్తగా వచ్చిన తెలిసీ తెలియని ఎమ్మెల్యేనో కాదు ఏకంగా ఉత్తరాంధ్రకే సీనియర్ లీడర్, సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు లాంటి వారు ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. వీళ్ళ అసహనం ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని తంగివానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మాన ప్రజలకు ఇలాంటి హెచ్చరిక చేశారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ధర్మాన ఇంటింటికీ వెళ్లారు. అయితే.. ఈ సంద‌ర్భంగా కొంద‌రు స్థానిక స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించారు. దీంతో మంత్రి ధ‌ర్మానకి కోపమొచ్చింది. పేద ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంద‌ని, ఇంకా ఏదో రాలేద‌ని, మాకు అది రాలేదు ఇది రాలేదని ఎందుకు అడుగుతున్నార‌ని వారిని నిల‌దీశారు. ఏవో చిన్న చిన్న కార‌ణాలలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలవకపోతే మీరే నష్టపోతారని హెచ్చరించారు. తనను ప్రశ్నించిన ప్రజలకు ఒక రకంగా క్లాస్ పీకిన ధర్మాన.. మ‌ళ్లీ వైసీపీని గెలిపించ‌క‌పోయారో అంటూ మొదలు పెట్టి మళ్ళీ ఏమనుకున్నారో ఏమో ఆ మాటతోనే ఆపేశారు. దీంతో ఆయ‌న చేసిన ఈ హెచ్చ‌రికలు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

అలాగే ఇంకాస్త ముందుకెళ్లిన మంత్రికి అక్కడ కూడా అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. దీంతో అసలు మీ ప్రాంతంలో చాలా మంది తనకి ఓటు వేయలేదని.. అయినా దయతలచి లక్షల రూపాయలు వెచ్చించి పనులు చేస్తున్నానని.. అలాంటి సమయంలో మీకు ప్రశ్నించే హక్కే లేదని తేల్చేశారు. తన నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పెద్దపాడు, తంగివానిపేట, వానవానిపేట, శాస్త్రులపేటల్లో తనకు మెజార్టీ రాలేదని.. అందుకే అభివృద్ధి పనులు చేయమ‌ని అడిగే హక్కు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు లేద‌న్నారు. మీరు ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ నేత‌లు.. ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని మంత్రి ప్ర‌జ‌ల‌ను ప్రశ్నించారు. కొందరు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తీసుకుని కూడా టీడీపీకి ఓటు వేస్తామ‌ని చెబుతున్నార‌ని.. ఇది స‌రికాద‌ని, అది మీకే మంచిది కాదన్నారు.

ఒక్క ధర్మాన మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది వైసీపీ నేతలది ఇలాంటి పరిస్థితే. గడపగడపకు వెళ్తున్న నేతలకు ప్రజల నుండి ప్రశ్నలే ఎదురువుతుండగా.. నేతలలో సహనం నశించి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. మీకు సంక్షేమం అందిందా లేదా అని ప్రశ్నిస్తే గత ప్రభుత్వంలో కూడా వచ్చేదే ఇప్పుడు కూడా వస్తుందని.. కానీ తమ ప్రాంతంలో అభివృద్ధి ఏదని నేతలను నిలదీస్తున్నారు. తమ గ్రామంలో, తమ కాలనీలో చేసిన ఒక్క అభివృద్ధి గురించి చెప్పాలని ప్రజలు నేతలను నిలదీస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు నేతలు భయపడి ఏదో తూతూమంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. మరికొందరు ఇలా ప్రజలనే బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. అసలే ఎన్నికల కాలం.. వాళ్ళ కాళ్ళు, గడ్డాలు పట్టుకుంటేనే పనికాని రోజులు. ఇలాంటి సమయంలో వాళ్లనే బెదిరిస్తే ఊరికే ఉంటారా! మరి వైసీపీ నేతలు ఈ లాజిక్ ఎలా మర్చిపోతున్నారో!

By
en-us Political News

  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.