మెడికల్ పీజీ సీట్ల స్కాం.. గవర్నర్ సీరియస్- ప్రభుత్వం పరేషాన్

Publish Date:Apr 25, 2022

Advertisement

తెలంగాణ ప్రభుత్వం- రాజ్ భవన్ సంబంధాలు రోజురోజుకూ నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా తయారవుతున్నాయి. ఎప్పుడైతే తెరాస ప్రభుత్వం ప్రొటోకాల్ కు తిలోదకాలిచ్చి తనను అవమానించిందంటూ  గవర్నర్ తమిళిసై కుండ బద్దలు కొట్టారో అప్పటి నుంచి విభేదాలు బహిర్గతమయ్యాయి. తలుపు చెక్కతో మీరొకటంటే...తమలపాకుతో నేనొకటంటా అన్నట్లుగా గవర్నర్, తెరాస నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ గా తమిళిసైను మారుస్తున్నరంటూ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఆ వార్తల స్పీడు అయితే చల్లారింది కానీ...సర్కార్- గవర్నర్ ల మధ్య విభేదాలు మాత్రం రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే కాళోజీ హెల్త్ వర్సిటీలో జరిగిన మెడికల్ పీజీ సీట్ల కుంభకోణం వెలుగులోనికి వచ్చంది. ఈ కుంభకోణం గవర్నర్ తమిళిసై చేతికి ఆయాచితంగా దొరికిన ఆయుధంగా మారింది. పైగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ గవర్నర్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న అవకాశం దొరికుతుందా అన్నట్లుగా కాచుకుని ఉన్న తమిళసైకి పీజీ సీట్ల కుంభకోణం అందివచ్చింది. రేవంత్ లేఖకు ముందే గవర్నర్ ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలను తనకు అందజేయాలంటూ కాళోజీ వర్సిటీ యాజమాన్యానికి తాఖీదు పంపారు. ఇంతకీ కాళోజీ వర్సిటీలో కుంభకోణం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఎందుకు పని కొస్తుందనుకుంటున్నారా? ఈ వర్సిటీపరిధిలోని పలు మెడికల్ కాలేజీలు తెరాస కు చెందిన వారివే. వీరిలో మంత్రి పువ్వాడ, మంత్రి మల్లారెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు వంటి వారు ఉన్నారు. 

అసలు పీజీ సీట్లకుంభకోణం ఏమిటంటే మెరిట్ ప్రకారం ఇవ్వాల్సిన సీట్లను బ్లాక్ చేసి అస్మదీయులకు కట్టబెట్టడం ద్వారా కోట్లు దండుకోవడమే ఈ కుంభకోణం. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ కు రాష్ట్రంలోని యూనివర్సిటీలపై విస్పష్ట అధికారాలు ఉంటాయి. అందుకే గవర్నర్ ఈ కుంభకోణాన్ని ప్రభుత్వాన్ని గట్టిగా ఇరుకున పెట్టడానికి అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. 
అయితే తమిళనాడులో వర్సిటీలపై గవర్నర్ అధికారాలలో కోత విధించేందుకు అక్కడి ప్రభుత్వం సమాయత్తమౌతున్నది, ఈ మేరకు వర్సిటీలో చట్టంలో మార్పులు తీసుకువస్తూ  అసెంబ్లీలో  బిల్లు ప్రవేశ పెట్టింది. ఆయన అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టే సమయానికి చెన్నైలో కేంద్ర, రాష్ట్ర, ప్రవేటు వర్సిటీల వీసీల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్ ప్రారంభించారు. తెలంగాణలో లాగే తమిళనాడులో కూడా గవర్నర్, ప్రభుత్వం మధ్య దూరం ఉంది. దీంతో తమిళనాడు గవర్నర్ వర్సిటీలపై గవర్నర్ ల అధికారంలో కోత విధించేందుకు వీసీల నియామకం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు వీలుగా వర్సిటీల చట్టంలో మార్పులు ప్రతిపాదిస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ  వర్సిటీల చాన్సలర్ పదవుల నుంచి గవర్నర్లను తొలగించాలన్న మదన మోహన్ పూంఛీ నేతృత్వంలోని కమిషన్ సిఫారసును ప్రస్తావించారు. ఇప్పుడు తమిళనాడులో పీజీ స్కాం విషయంలో గవర్నర్ దూకుడును అడ్డుకునేందుకు తెరాస సర్కార్ కూడా ఆ కమిషన్ నివేదికను తెరపైకి తీసుకువచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా మెడికల్ పీజీ సీట్ల స్కాం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. 

By
en-us Political News

  
జగన్ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది. 2014-19 మధ్యకాలంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి, తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ, చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా మంగళవారం ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు.
జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు ఇల్లతరసి పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు. ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.