లగడపాటి మంత్రాంగం.. రాజ‌కీయ క‌ల‌క‌లం..

Publish Date:Apr 25, 2022

Advertisement

‘ఆంధ్రా ఆక్టోపస్’, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే వారి భేటీ పలు అనుమానాలకు కూడా అవకాశం ఇస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు కాకుండా ఉండాలని అప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న లగడపాటి సమైక్య నినాదాన్ని బలంగా వినిపించారు. రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పినట్లే ఆయన చాన్నాళ్లుగా రాజకీయంగా కనుమరుగయ్యారు. అయితే.. శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామ, చందర్లపాడులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి లగడపాటి హాజరయ్యారు. అక్కడితో ఆగకుండా వసంత కృష్ణప్రసాద్ తో భేటీ అయ్యారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజవర్గాల్తోని కాంగ్రెస్, వైసీపీ నేతలతో కూడా సమావేశమయ్యారు. రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రెండు రోజుల పాటు ఇలా హల్ చల్ చేయడాన్ని పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు.

ఏపీ సీఎం కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన రెండో కేబినెట్ లో సామాజిక సమీకరణలో భాగంగా అయినా వసంత కృష్ణప్రసాద్ కు స్థానం కల్పించి ఉండాల్సింది. తొలి కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించిన కమ్మ సామాజికవర్గానికే చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి పొడిగింపు ఇవ్వలేదు. కొడాలి నానికి పొడిగింపు ఉందడనే విషయం ముందుగానే లీకులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో రెండో కేబినెట్ లో సామాజిక సమీకరణలో భాగంగా తనకు బెర్త్ కోసం కృష్ణప్రసాద్ బాగా ఆశలు పెంచుకున్నారు. అయితే.. ఆయనకు మొండిచెయ్యి చూపించారు సీఎం జగన్. అప్పటి నుంచీ కృష్ణప్రసాద్ అసహనానికి, ఆవేదనకు గురయ్యారనే వార్త వచ్చాయి. అసలే వైసీపీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్న వసంత కృష్ణప్రసాద్ తో అదే సామాజికవర్గానికి చెందిన లగడపాటి రాజగోపాల్ భేటీ కావడం, ప్రత్యేకంగా ఇద్దరూ చర్చించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

2019 నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాజగోపాల్ మళ్లీ చైతన్యవంతం అవుతారా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. లేదంటే తన కుమారుడు అశ్రిత్ చేత పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు పావులు కదుపుతున్నారా? అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. లగడపాటి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే... విజయవాడ లోక్ సభా స్థానం నుంచి తాను బరిలో దిగి, తన కుమారుడి చేత ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే వ్యూహం ఏదో పన్నుతున్నారని, ఆ క్రమంలోనే వసంత కృష్ణప్రసాద్ తో పాటు కాంగ్రెస్, వైసీపీ రాజకీయ నేతలతో చర్చలు జరిపారంటున్నారు. విజయవాడ టీడీపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న దేవినేని ఉమకు గట్టి ప్రత్యర్థి అయిన వసంత కృష్ణ ప్రసాద్ తో లగడపాటి భేటీ దేనికి దారితీస్తుందనే చర్చ నడుస్తోంది.

రాజగోపాల్ మళ్లీ యాక్టివ్ అవ్వాలని, అందుకు పొలిటికల్ ప్లాట్ఫాం కోసం వసంత కృష్ణప్రసాద్ ద్వారా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు యత్నించే క్రమంలోనే ఈ సమావేశం జరిగిందని కొందరు అంచనా వేస్తున్నారు. మంత్రి పదవి దక్కలేదనే బాధలో ఉన్న కృష్ణప్రసాద్ ను వైసీపీ అధిష్టానంపై ఉసిగొల్పే రాజకీయ ప్రయత్నానికేమైనా తెర లేపారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతుండడం గమనార్హం. లగడపాటి- వసంత కృష్ణప్రసాద్ మధ్య సాన్నిహిత్యం ఉంది. దాంతో పాటు వారి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని అంటారు. ఈ క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ కు మద్దతుగా నిలవడం, ఆయన భవిష్యత్ వ్యూహ రచనకు తోడ్పాటు అందించడానికి కూడా లగడపాటి భేటీ అయ్యారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకవేళ లగడపాటి వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వెంటనే ఓకే చెబుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే విజయవాడలో గత రెండు లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున కేశినేని నాని గెలిచారు. అయితే.. ఇప్పుడాయన టీడీపీతో కాస్త అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటున్నారు. కేశినేనిపై 2019లొ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన పొట్లూరి వరప్రసాద్ ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో విజయవాడ స్థానంలో అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి కూడా వ్యాక్యూమ్ ఉంది. ఈ సమయంలో లగడపాటి వస్తానంటే నేనొద్దంటానా? అని వైఎస్ జగన్ అంటారంటున్నారు.

ఏదేమైనా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, లగడపాటి రాజగోపాల్ సమావేశం ఇప్పుడు రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలకు, అంచనాలకు, అనుమానాలకు అవకాశం ఇచ్చింది.

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.