విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా

Publish Date:Jul 17, 2022

Advertisement

ఉప రాష్ట్రప‌తి ఎన్నికలో విప‌క్షాల అభ్య‌ర్థిగా మాజీ గ‌వ‌ర్న‌ర్ మార్గ‌రెట్ అల్వా పోటీ లో దిగనున్నారు.   ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ నివాసంలో సమావేశమైన విపక్షాలు మార్గరెట్ అల్వా అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశాయి. ఆ తరువాత శరద్ పవార్ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పేరును ప్రకటించారు.  తనను విప‌క్షాల ఉమ్మడి ఉప రాష్ట్రప‌తి తనను ఎంపిక చేయడాన్ని  గౌర‌వ‌ంగా భావిస్తున్నట్లు అల్వా పేర్కొన్నారు.  తన మీద మీద న‌మ్మ‌కం ఉంచినందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నానని  ట్వీట్ చేశారు. కాగా, ఆమె గ‌తంలో గోవా, రాజ‌స్థాన్, గుజ‌రాత్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు.

మ‌రోవైపు, విప‌క్ష పార్టీలు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్ స్పందిస్తూ… త‌మ‌కు మెజారిటీ ఉంద‌ని, ఇత‌ర అభ్య‌ర్థి గెలిచే అవ‌కాశం లేద‌ని అన్నారు. విప‌క్షాలు అభ్య‌ర్థిని పోటీకి దింప‌క‌ుండా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.  1969లో   రాజకీయాల్లోకి ప్రవేశించిన అల్వా కాంగ్రెస్‌లో  కీలక పదవులు చేపట్టారు.

1974లో తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 1980,1986,1992లో వరుసగా రాజ్యసభకు నియమితులయ్యారు. 1999లో ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసి మార్గరెట్‌ అల్వా పరాజయం పాలయ్యారు.  2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆ తర్వాత నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. గోవాకు 17వ గవర్నర్‌గా సేవలందించారు. గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేశారు.  

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.