తెలంగాణలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బంజారా హిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండో కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయుధాలు అప్పగించి లొంగిపోయినట్లు ప్రకటించారు వీరిలో ఏపీ మావోయిస్టు కార్యదర్శి చలసాని నమత కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ సినీ నటుడు కాకరాల కుమార్తె మాధవి అలియాస్ షకీలా కూడా లొంగిపోయిన వారిలో ఉండటం విశేషంగా మారింది. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తంతో పాటు మవోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి, గన్‌మెన్లు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానంపై నమ్మకం ఉంచి ప్రధాన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకుని లొంగిపోయినట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 128 ఆయుధాలు సమర్పించగా, వాటిలో AK-47 రైఫిల్స్ – 31, INSAS రైఫిల్స్ – 21, SLR రైఫిల్స్ – 20, .303 రైఫిల్స్ – 18, 7.62 బోర్ ఆయుధాలు – 17, 8 mm ఆయుధాలు – 2, .315 రైఫిల్ – 1, INSAS LMG – 1, 9 mm పిస్టల్ – 1, BGL – 2 ఉన్నాయి.
అదనంగా మరికొన్ని ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఆయుధాలతో పాటు మొత్తం 5,205 తూటాలను కూడా మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. ఈ లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభుత్వ పునరావాస విధానం కీలక పాత్ర పోషిస్తున్నదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maoist-surrender-36-215174.html
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంతటా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట వినిపిస్తోన్న మాట.
యుద్దం ముంగిపునకు ఇరాన్‌పై వత్తిడి తెచ్చేలా అమెరికా పలు షరతులు విధిస్తూ డెడ్ లైన్ విధించింది.
అమరావతికి తాము కట్టుబడి లేమంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనక సారమేంటి? అయితే వైసీపీ తిరిగి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టా?
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రజలపై మోయలేని భారం పడుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంకకు మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి.
రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు? రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా?
ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా భారత్ స్థిరమైన సముద్ర రవాణాను కొనసాగించింది. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసిన ఫిబ్రవరి 28 నుండి, భారత నౌకలకు చెందిన కనీసం ఎనిమిది నౌకలు ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించాయి.
తాజా నిబంధనల ప్రకారం, వాహనదారులు టోల్ రుసుమును ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే, యూపీఐ ద్వారా సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.
చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది.