మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాట.. రెండు రోజుల్లో సరెండర్?
Publish Date:Mar 4, 2026
Advertisement
మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన మరో రెండు రోజుల్లో తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అవుతారు. ఐదు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గణపతి, 2018 వరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సారథ్యం వహించారు. ఆ తరువాత అనారోగ్య కారణాలతో కేంద్ర కార్యదర్శి పదవికి రాజీ నామా చేశారు. అప్పటి నుంచీ ఆయన పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు. పదవి విరమణ తర్వాత గణపతి కొంత కాలం నేపాల్‌లో ఆ తరువాత ఫిలిప్పీన్స్‌లో కూడా ఉన్నారని సమాచారం. గత కొంతకాలంగా తెలంగాణ పోలీ స్ ఉన్నతా ధికారులతో గణపతి బృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గణపతి టీమ్ పోలీసు అధి కారుల టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. గణపతితో పాటు అతని భద్రతా దళం భారీ ఆయు ధాలతో పోలీసుల ఎదుట లొంగిపోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా, మిగిలిన అగ్రనాయకులు, పెద్ద సంఖ్యలో మావోయిస్టు క్యాడర్ కూడా సమష్టిగా సరెండర్ అయ్యే ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు ఎండ్ కార్డ్ పడినట్లేనని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, చర్చల ప్రయత్నాలు ఈ పరిణామానికి దారితీసిన ప్రధాన కారణాలుగా భావి స్తున్నారు. ఇలా ఉండగా గణపతి లొంగుబాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గణపతి లొంగుబాటు వార్త రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
http://www.teluguone.com/news/content/maoist-leader-ganapathi-to-surrender-36-215030.html





