చంచల్‌గూడ జైలు సమీపంలో ఖైదీ పరారీ
Publish Date:Apr 20, 2026
Advertisement
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. చంచల్‌గూడ జైలు నుంచి పీటీ వారెంట్‌పై ముగ్గురు ఖైదీలను పోలీసులు తరలిస్తుండగా, వారిలో ఒకరు పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం, జైలులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ఖైదీలను కోర్టు ప్రక్రియల నిమిత్తం బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో చంచల్‌గూడ ప్రధాన రహదారిపై వాహనం నిలిపిన సమయంలో, ఒక ఖైదీ పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఖైదీ పరారైన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా చంచల్‌గూడ, మలక్‌పేట్, కోటి, ముసారంబాగ్ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పరారైన ఖైదీపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తుండగా, ఖైదీ ఎలా తప్పించుకున్నాడన్న దానిపై విచారణ కొనసాగుతోంది. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో నగరంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
http://www.teluguone.com/news/content/prisoner-escapes-near-chanchalguda-jail-36-217824.html





