మునీర్ ను దౌత్య వంతెనగా చూసిన ట్రంప్.. లాభమా.. భద్రతా బందీనా?

Publish Date:Apr 20, 2026

Advertisement

అసిమ్ మునీర్ ఇప్పుడు పాకిస్థాన్ సైన్యాధిపతి మాత్రమే కాదు.. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు తెరవెనుక కీలక మధ్యవర్తి కూడా. కానీ అదే పాత్ర, వాషింగ్టన్ దృష్టిలో..  ఆయనను విలువైన ఆస్తిగా కాకుండా ప్రమాద సూచికగా కూడా మారుస్తోంది.  ఇది ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు. ఇది అమెరికా విదేశాంగ విధానం ఇలా ఎలా వ్యక్తిగత సంబంధాలపై..  రహస్య మార్గాలపై..  తాత్కాలిక ఒప్పందాలపై ఆధారపడుతోందన్న ప్రశ్న.

దౌత్యం కాదు, డ్యామేజ్ కంట్రోల్

ట్రంప్ పరిపాలనకు మునీర్ తో ఉన్న సాన్నిహిత్యం కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఒక వ్యూహాత్మక పరీక్షగా మారింది.  ఒకవైపు ఇరాన్ తో పరోక్ష చర్చలు సాగుతున్నాయి. మరోవైపు , మునీర్ కు టెహ్రాన్ అగ్ర సైనిక వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక్కడ సమస్య మునీర్ మాట్లాడుతున్నారా లేదా అన్నది కాదు. ఆయన ఎవరి తరఫున, ఎంత పారదర్శకంగా, ఎంత నమ్మదగిన రీతిలో మాట్లాడుతున్నారన్నదే అసలు ప్రశ్న. అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నది కూడా ఇదే.  మధ్యవర్తి అనే ముసుగులో వ్యూహాత్మక చీలికలు తెచ్చే అవకాశం ఉంది.

పాకిస్థాన్ పాత రికార్డు మర్చిపోలేం

పాకిస్థాన్ ను  అనివార్య భాగస్వామిగా వాషింగ్టన్ ఎన్నిసార్లు చూసినా..  అదే దేశం ఎన్నిసార్లు తన స్వప్రయోజనాల కోసం ఆట మార్గం మార్చిందో చరిత్ర గుర్తు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లకు ఇచ్చిన మద్దతు..  అమెరికా సహాయాన్ని పొందుతూ రెండు వైపులా ఆడిన విధానం, ఇవన్నీ అమెరికా విశ్వాసాన్ని బలహీనపరిచేవే.
అందుకే మునీర్ పై ఆధారపడటం కేవలం దౌత్యం కాదు..  అది జియోపాలిటికల్ జూదం. ఒక చేత్తో శాంతి ఒప్పందం, మరో చేత్తో నిఘా అపోహలు.. ఈ కలయిక అమెరికాకు తాత్కాలిక లాభం ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఖర్చు భారీగా ఉండొచ్చు.

వాన్స్ ఎందుకు వెనక్కి తగ్గారు?

జేడీ వాన్స్ పాకిస్థాన్ పర్యటన నుంచి తప్పుకోవడం చిన్న విషయం కాదు. భద్రతా కారణాలు మాత్రమే అని చెబుతున్నా, దాని వెనుక చర్చల సున్నితత్వం, విశ్వాస లోపం,   వేదికపై ఉన్న అనిశ్చితి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యున్నత స్థాయి నేతను పక్కకు పెట్టి, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి ట్రంప్ కు అత్యంత సన్నిహితులపై ఆధారపడటం ఒక సంకేతం.. ఈ చర్చలు సాంప్రదాయ దౌత్యం కాదు, వ్యక్తిగత ప్రభావం ఆధారిత ఒప్పంద యత్నం. అలాంటి సందర్భాల్లో ఒక్క తప్పు అంచనా కూడా పెద్ద భౌగోళిక రాజకీయ ధరను తెచ్చిపెడుతుంది.

ట్రంప్ శైలి, వ్యూహాత్మక ప్రమాదం

ట్రంప్ ఎప్పుడూ డీల్ ఫస్ట్  నాయకుడే. ఆయనకు మిత్రులు, శత్రువులు కాదు..  ఉపయోగపడేవారు, ఉపయోగపడనివారు మాత్రమే ఉంటారు. మునీర్ ఆ కోవలో ఉపయోగపడే వ్యక్తిగా ట్రంప్ కు కనిపించి ఉండొచ్చు. కానీ అమెరికా జాతీయ భద్రతా యంత్రాంగానికి అటువంటి వ్యక్తిగత విశ్వాసం సరిపోదు.
దౌత్యం కేవలం ఫోన్ కాల్స్  తో, వ్యక్తిగత ప్రశంసలతో, లేదా  ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ వంటి పదాలతో నడవదు. అది కచ్చితమైన పారదర్శకత, ప్రయోజనాల స్పష్టత,  విశ్వసనీయతపై నిలబడాలి. మునీర్ విషయంలో ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు, ఆయనను వంతెనగా కాదు, భద్రతా లోపంగా చూడడం సహజమే.

అమెరికాకు ఇప్పుడే పాఠం అవసరం

ఇక్కడ  పెద్ద నిజం ఇదే..  మధ్యవర్తులను ఎంచుకోవడం సులభం..  కానీ వారిని నియంత్రించడం కష్టం. అమెరికా, ఇరాన్ చర్చల్లో పాకిస్థాన్ ను ఉపయోగించుకోవాలన్న ఆలోచన తాత్కాలికంగా మంచిగా  కనిపించవచ్చు. కానీ పాకిస్థాన్ గతం, మునీర్ నెట్ వర్క్  ప్రాంతీయ అస్పష్టతలు ఈ వ్యూహాన్ని బలహీనపరుస్తున్నాయి. శాంతి ఒప్పందాల కోసం భద్రతా ఆందోళనలే ప్రధాన సమస్యగా మారితే..  ఆ దౌత్యం ఇప్పటికే సున్నితంగా ఉందని అర్థం. వాషింగ్టన్ దీనిని ఇప్పుడే గుర్తించకపోతే, తర్వాత అది పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

చివరి మాట

మునీర్ ను  ట్రంప్ ఎంతగా నమ్మినా..  అమెరికా నిఘా వ్యవస్థకు నమ్మకం లేదు..  అప్రమత్తతే ముఖ్యం. మధ్యవర్తిత్వం పేరుతో వేషం వేసుకున్న ప్రభావం, చివరికి అమెరికా ప్రయోజనాలకే ముప్పు తెస్తే? అదే అసలు ప్రశ్న. అమెరికాకు కావలసింది మరొక  ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్  కాదు. కావలసింది నమ్మదగిన విధానం. అదే ఇప్పుడు అత్యంత తక్కువగా కనిపిస్తోంది.


References:
https://www.foxnews.com/world/trumps-favorite-field-marshal-who-pakistans-powerful-army-chief-asim-munir-deep-intel-ties 
https://www.nytimes.com/2026/04/08/world/middleeast/pakistan-iran-us-ceasefire-talks.html 
https://www.indiatoday.in/world/story/general-asim-munirs-reported-iran-ties-a-red-flag-for-us-intel-report-2898370-2026-04-19 
https://www.youtube.com/watch?v=NCGCJ7ohwBU 
https://www.youtube.com/watch?v=FKfSG53Nr4U 
https://www.timesofisrael.com/liveblog_entry/trump-says-vance-not-going-to-pakistan-for-iran-talks-due-to-security-concerns/ 
https://www.ndtv.com/world-news/donald-trump-praises-pakistans-shehbaz-sharif-asim-munir-after-us-iran-talks-calls-them-very-extraordinary-men-11348910 
https://www.instagram.com/p/DXUUdrDk6-K/ 
https://www.youtube.com/watch?v=9ndoQNY43Fs 


 
-సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
కోయంబత్తూరు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సగం రోడ్డు వేసి.. మిగతా సగం రోడ్డు వేయకుండా ప్రజలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని విమర్శించారు. వారం రోజుల్లో రోడ్డు వేస్తారో లేదో తెలపాలనీ, లేని పక్షంలో సీఎం ఆఫీస్ కి వెళ్తామని హెచ్చరించారు.
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం (20-04-2026) అగ్నిప్రమాదం సంభవించింది.
సాధారణంగా అరవై ఏళ్లు దాటగానే చాలామంది విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యం సహకరించదని బాధ్యతలను పక్కన పెట్టేస్తుంటారు.
సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది.
పశ్చిమ జపాన్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప ధాటికి పలు భవనాలు కుప్పకూలినట్లు చెబుతున్నారు. భూకంపం తరువాత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం జపాన్ లోని ఇషికావా పరిధిలోని నోటో ద్వీపంలో సంభవించింది. దాదాపు నిముషం పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు కింద పడిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
దురాశ ఉంటే జడ్జిలుగా ఉండే అర్హత లేదు...జస్టిస్ నాగరత్న సంచలన వ్యాఖ్యలు
తనపై దాడి జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగలనని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తూ.. ఈ జలసంధిని ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటోంది. ఈ విడత మూసివేత వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమవుతోందని రష్యా ముందస్తుగా ఇరాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం.
ఈ జలసంధి ప్రపంచ ఎనర్జీకి నాడి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20శాతం వరకు, ఈ సన్నని జలసంధి గుండా మాత్రమే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. దీని భౌగోళిక స్థానం చూస్తే.. ఒక వైపు ఇరాన్, మరో వైపు యూఏపీ. ఇది గల్ఫ్ నుంచి అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రానికి వెళ్లే ఏకైక సముద్ర ద్వారం. అందుకే.. హోర్ముజ్ మూసివేత అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా బందీగా పెట్టగలదు అని చూపించే అత్యంత శక్తివంతమైన లీవర్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తన 76వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.