ఫిన్ ఎలెన్ పరుగుల సునామీ.. టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు దూసుకెళ్లిన కివీస్

Publish Date:Mar 4, 2026

Advertisement

న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. బుధవారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించి దర్జాగా ఫైనల్ లోకి అడుగుపెట్టింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ సఫారీలను 169 పరుగులకే కట్టడి చేసింది. ఓ దశలో సఫారీలు కేవలం 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండటంతో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మార్కో యాన్సెస్ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయడానికి దోహదపడ్డాడు. మార్క్ 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 34 పరుగులతో డివాల్ట్ బ్రెవిస్, 29 పరుగులతో ట్రిస్టన్ స్టబ్స్ కూడా రాణించడంతో దక్షిణాఫ్రికీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 

170 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. పెనర్ ఫిన్ అలెన్ అయితే పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే శతకబాది టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతంమైన సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. మరో ఓపెనర్ టిమ్ స్టిఫర్డ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు కేవలం 9.1 ఓవర్లలోనే 117 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. 58 పరుగులు చేసిన స్టిఫర్డ్  ఔటైన తరువాత రచిన్ రవీంద్ర బరిలోకి వచ్చాడు. మరో వికెట్ పడకుండా కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టోర్నీలో ఇప్పటి వరకూ అపజయమనేదే లేకుండా సెమీస్ కు చేరిన దక్షిణాఫ్రికా ఇంటిబాట పట్టాల్సి వచ్చింది.    

ఈ మ్యాచ్‌లో అసలైన హైలైట్ ఫిన్ అలెన్ బ్యాటింగే. తన విధ్వంసకర బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. అలెన్  33 బంతుల్లో శతకబాది..  47 బంతుల్లో సెంచరీ చేసిన క్రిస్ గేల్ రికార్డును తిరగరాశాడు.    మొత్తం మీద కివీస్ 170 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించింది.  ఫిన్ అలెన్ విధ్వంసక బ్యాటింగ్‌తో ఈ సెమీఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. దక్షిణాఫ్రికా మరోసారి ఐసీసీ టోర్నీలో నాకౌట్ దశలోనే ఇంటిముఖం పట్టింది.

By
en-us Political News

  
జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఒక హృద్యమైన సంఘటన అందరి మనసులను తాకింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది.
ప్రముఖ కన్వెన్షన్ వ్యాపారవేత్త శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు.
ప్రస్తుత తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు వృద్ధిని కాపాడుకుంటూనే, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ఆర్‌బీఐ ముందున్న ప్రధాన సవాలు.
భారత ఆర్థిక వ్యవస్థకు బలం ఇచ్చేది దేశీయ వినియోగం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, గత కొన్ని సంవత్సరాల్లో బలపడ్డ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు. 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6శాతం వృద్ధి తరువాత కూడా, భారత్ బలమైన స్థితిలోనే ప్రపంచ అనిశ్చితిలోకి ప్రవేశిస్తోందని అధ్యయనం పేర్కొంది.
కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.తన విధ్వంసకర బ్యాటింగ్ తో 18 ఏళ్ల రికార్డును సమం చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాలుగు వరుస పరాజయాల తరువాత తొలి గెలుపును అందుకుంది. ఈ విజయం జట్టు సమష్టి ప్రదర్శనతో లభించింది.
అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు, . సెల్లార్‌లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడ భద్రపరిచిన పాత సోఫాలు, ఇతర గృహోపకరణాల అంటుకుని క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.
ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బంది సహాయంతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి.
లోకేష్ పొరబాటున ఒక తల్లిగా భావించి విజయమ్మ పుట్టిన రోజుకు ఒక ట్వీట్ పెట్టిన పాపానికి అది అటు దిరిగి ఇటు దిరిగి ఎన్నో వివాదాలకు కారణమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.