రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే...మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Publish Date:Mar 23, 2026

Advertisement

 

హైదరాబాద్ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తానే ముఖ్యమంత్రిని చేశానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డి తప్ప మరెవరూ పవర్‌ఫుల్ నాయకులు లేరని, ఆ విషయాన్ని రెడ్డి సంఘం సమావేశంలో తానే చెప్పానని తెలిపారు. 

అదేవిధంగా “ఎవరు ఏమన్నా, నేను – రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే” అంటూ తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల మధ్యలోనే సినిమాల విషయాన్ని ప్రస్తావిస్తూ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీష్ శంకర్ తనను సంప్రదించారని, అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడించారు. భవిష్యత్తులో సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర చేయాలనే ఆసక్తి ఉందని కూడా చెప్పారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

అయితే ఈ సందర్భం గా అక్కడే ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సరదాగా స్పందించారు. మల్లారెడ్డి ముఖ్యమంత్రి పాత్రకు సెట్ కాదని, సినిమాల్లో సీఎం పాత్రలు రెండు నిమిషాలే ఉంటాయని చమత్కరిం చారు. “నీకు విలన్ పాత్రే బాగా సెట్ అవుతుంది… ఎలివేషన్ కూడా విలన్ పాత్రలోనే ఉంటుంది” అంటూ నవ్వులు పూయిం చారు. నీ హైట్‌కు విలన్ పాత్రే సరిపోతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సరదా చిట్‌చాట్ అసెంబ్లీ లాబీలో ఉన్న వారిని అలరించగా, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

By
en-us Political News

  
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.