టెన్త్‌ టాపర్లను విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి

Publish Date:May 21, 2026

Advertisement

 

టెన్త్ టాపర్లకు గుంటూరు ఎమ్మెల్యే ప్రత్యేక ప్రోత్సాహం..

పదో తరగతి 40 మంది టాపర్లతో విమానంలో ఢిల్లీకి ఎమ్మెల్యే..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం లభించింది. పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆమె విమానంలో ఢిల్లీకి విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లారు.

 

 

ఈ సందర్భంగా విద్యార్థులు గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కేంద్ర మంత్రి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి, పదవ తరగతిలో ప్రతిభ కనబర్చినందుకు ప్రత్యేకంగా అభినందించారు.

 

 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆయన ప్రోత్సహించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలు, ఉన్నత విద్యపై వారి ఆసక్తులను తెలుసుకుంటూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి చేపట్టిన ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


 

By
en-us Political News

  
బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 131 బంతుల్లో 210 పరుగులు చేసి వన్డేల్లో అత్యంత వేగవంతమై డబుల్ సెంచరీతో రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి నడిపిస్తూ అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్‌ను పరిచయం చేశాడు. బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రంతోనే అబ్బుర పరుస్తున్నాడు.
నేపాల్ ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం.. బాధితులు శిఖరం నుంచి కిందకు దిగుతుండగా తీవ్ర అలసటతో అస్వస్థతకు గురయ్యారు. వారిని రక్షించేందుకు గైడ్స్‌ తీవ్రంగా ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. మృతులను భారత్‌కు చెందిన అరుణ్‌ కుమార్‌ తివారీ, సందీప్‌ ఆరేగా గుర్తించారు.
పరస్పర అంగీకారంతో ప్రేమ బంధాల్లో ఉండే టీనేజర్లపై ఆటోమేటిక్‌గా అత్యాచార కేసులు నమోదు కాకుండా నిరోధించేందుకు.. తమ దేశ అత్యాచార నిరోధక చట్టంలో ఒక ప్రత్యేకంగా రోమియో జూలియట్ క్లాజ్ తీసుకు రావాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.
కొన్ని రోజులుగా ఆమెపై ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్ మీడియా వేదికల్లో కొందరు వ్యక్తులు అసభ్యకర పోస్టులు, అవమానకర కామెంట్లు చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా.. గౌరవాన్ని కించప రిచేలా పోస్టులు వైరల్ చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు మంత్రి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా విమాన ప్రయాణంతో కూడిన వైజాగ్, అరకు వ్యాలీ టూర్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లైట్ టికెట్లు చేతిలో పడగానే విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు విదేశీయులు తమ లగేజ్ బ్యాగుల్లో గంజాయిని అత్యంత గుట్టుగా తరలించే ప్రయత్నం చేశారు. గంజా యిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి, వాటిని వ్యాక్యూమ్ సీల్ చేసి కస్టమ్స్ తనిఖీల్లో అనుమానం రాకుండా ప్లాన్ చేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి), పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల ప్రాంతాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం ఈ ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని దాదాపు 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46.2 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల సెల్సియస్‌ మధ్య రికార్డవడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
kohli reject to shake hand with travis head, contraversym ipl2026, sunrisers,rch, match
రన్ మెషీన్ గా పరుగుల సునామీ సృష్టించే విరాట్ కోహ్లీ.. వ్యక్తిగత స్కోరుతోనే కాకుండా, పార్టనర్ షిప్ లు నెలకొల్పడంలోనూ తనకు తానే సాటి అని ఈ రికార్డు ద్వారా నిరూపించుకున్నాడు.
దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఏకంగా 270.82 గిగావాట్ల విద్యుత్ వాడకం నమోదింది. ఇది భారత విద్యుత్ రంగ చరిత్రలో కొత్త రికార్డు. ప్రభుత్వం ఈ వేసవి కాలానికి అంచనా వేసిన గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లను కూడా ఈ రికార్డు దాటేసింది.
గుర్తు తెలియని వ్యక్తులు మధును దారుణంగా నరికి చంపారు. హత్య అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు శరీర భాగాలను గోనె సంచుల్లో గట్టిగా కట్టేశారు. ఆపై ఆ గోనె సంచులను సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌ కాల్వలో పడేశారు. కాల్వలో అనుమానాస్పదంగా పడి ఉన్న గోనె సంచులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అమెరికా డాలర్ రోజురోజుకూ బలోపేతం కావడం... యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు ఊహించని విధంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి నుంచి తమ లాభాల స్వీకరణకు, అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
ప్రత్యేక బిహేవియర్ కోడ్ ఆఫ్ కండక్ట్.. అంటే పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించేలా ఒక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక ప్రాంతాలకు వచ్చే కుటుంబాలు, ముఖ్యంగా మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, మహిళా పర్యాటకులు ఎక్కడా అసౌకర్యానికి, వేధింపులకు గురికాకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.