Publish Date:Mar 23, 2026
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, గ్యాస్ పొదుపు చర్యలపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దృష్టి సారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. గృహ వినియోగదారులకు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో 10 కిలోల గ్యాస్‌తో సిలిండర్లను సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ విధానంతో అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని భావించినట్టు కథనాలు సూచించాయి. అయితే ఇందుకు ప్రభుత్వ అనుమతులు అవసరమేకాకుండా, బాట్లింగ్ ప్లాంట్లలో సాంకేతిక మార్పులు కూడా అవసరమవుతాయని పేర్కొన్నారు.
ఇక యుద్ధ పరిస్థితులు కొనసాగితే వచ్చే నెలల్లో గ్యాస్ కొరత మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గల్ఫ్ దేశాల నుంచి ఇటీవల రెండు నౌకల ద్వారా సుమారు 92,700 టన్నుల ఎల్పీజీ భారత్‌కు చేరుకున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ వినియోగంలో పొదుపు అవసరమని పెట్రోలియం శాఖ అధికారులు సూచిస్తున్నారు.
అయితే 14.2 కిలోల సిలిండర్లను 10 కిలోలకు తగ్గించే నిర్ణయం తీసుకున్నారన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై స్పందించిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ, అలాంటి ప్రతిపాదనలపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రచారంలో ఉన్న వార్తలు ఊహాగానాలేనని పేర్కొన్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు అంశంపై వస్తున్న వార్తలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది. ప్రస్తుతం గృహ వినియోగదారులకు యథావిధిగా 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లే సరఫరా కొనసాగనున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lpg-cylinder-36-216023.html
సైబర్ క్రైమ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, ఐఎంఈఐ ట్రేసింగ్ వంటి పద్ధతులను వినియోగించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
గోదాములో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ సామాగ్రి పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ కొద్దిసేపటికే గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
మొజ్తబా ఖమేనీ.. కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత విషాదకరంగా, గందరగోళంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టీ చూస్తే.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో.. ఇరాన్ సీనియర్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. చనిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోమ్ నగరంలోని ఒక ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం (ఏప్రిల్ 8) రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ బృందం అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రశంసించింది.
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.