పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి … బలవంతపు గర్భస్రావ యత్నం

Publish Date:Feb 12, 2026

Advertisement

 

పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట జీవితంలో కల్లోలం నెలకొంది. నాలుగు నెలల గర్భిణీ అయిన యువతిపై బలవంతంగా గర్భస్రావం చేయించే ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్  జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహేష్ , భాగ్య ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు.. దీంతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

జనవరి 30న యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈ ప్రేమ జంట వివాహం చేసుకుంది. అప్పటికే భాగ్య నాలుగు నెలల గర్భిణీగా ఉన్నట్లు సమాచారం. ఈ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.వివాహం అనంతరం భాగ్యను ఆమె తండ్రి, బావ కలిసి ఒత్తిడి చేసి కల్వకుర్తి సమీపంలోని ఓ ఆసుపత్రిలో గర్భ స్రావం చేయించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు మహేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ పరిణామాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన భాగ్య ఆత్మహత్యకు ప్రయత్నించింది.ఈ ఘట నపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో ప్రియుడు... మహిళ సమ్మతి లేకుండా గర్భస్రావం చేయించడం చట్టపరంగా తీవ్రమైన నేరమని పేర్కొంటూ, తన భార్యకు ప్రాణహాని ఉందని తెలియజేస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని పరిశీలించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ ఘటన పై వెంటనే స్పందించింది. 

మహిళ స్వేచ్ఛ, శారీరక స్వాతంత్ర్యంపై దాడి చేయడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. మహిళ సమ్మతి లేకుండా గర్భస్రావం చేయించడం భారతీయ శిక్షాస్మృతి ప్రకారం శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. కల్వకుర్తి సీఐ, వంగూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ వోలను ఫిర్యాదుపై తక్షణమే స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అలాగే ఈ కేసును నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో విచారణ జరపాలని సూచించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలపై ఫిబ్రవరి 26 నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బాధిత యువతికి రక్షణ కల్పించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించింది.
 

By
en-us Political News

  
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.