అంతర్రాష్ట్ర సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు

Publish Date:Feb 12, 2026

Advertisement

 

ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ నగరానికి వచ్చిన యువత ఉద్యోగాలు లేవంటూ బాధపడుతుంటే… ఓ మహానుభావుడు మాత్రం కొత్త రకం ‘స్టార్టప్’ మొదలుపెట్టాడు. పనీపాట లేక అవారాగా తిరిగే పోకిరీలను ఎంపిక చేసి… “రోజుకు వెయ్యి రూపాయలు… ఫుల్ మీల్స్… ఫ్రీ అకమోడేషన్…” అంటూ ఆఫర్ ఇచ్చాడు. వినడానికి బాగానే ఉంది 

కదా! కానీ జాబ్ ప్రొఫైల్ వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇంత కేర్ తీసుకునే ‘బాస్’ అరుదుగా దొరుకుతాడు. చేయాల్సిన పని పొద్దున్నే రద్దీ ప్రదేశాల్లో ‘డ్యూటీ’ ఎక్కాలి. ఒంటరిగా ఉన్నవారిని గానీ, ఫోన్‌లో బిజీగా ఉన్నవారిని గానీ టార్గెట్ చేసి… చాకచక్యంగా పని పూర్తి చేయాలి.. సాయంత్రానికి ‘కలెక్షన్’ బాస్‌కి హ్యాండోవర్ చేయాలి. 

పనితీరు బాగుంటే మెచ్చుకోలు, ఆపై బోనస్.. ఇది మంచి ఉద్యోగమే కదా అని అనుకుంటున్నారా..ఇది అలాంటి ఇలాంటి ఉద్యోగం కాదండోయ్.. సెల్ ఫోన్లు చోరీ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అంతర్రాష్ట్ర ముఠా...అయితే ఇటీవల మెహిదీపట్నం ప్రాంతంలో సెల్‌ఫోన్ చోరీలు పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీలు, టెక్నికల్ ట్రాకింగ్‌తో ఈ ‘కంపెనీ’ కార్యకలాపాలను బట్టబయలు చేశారు...

హైదరాబాదు నగరంలోని రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహదీపట్నం పోలీసులు  గుట్టురట్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు, జార్ఖండ్‌కు చెందిన ఒకరు కలిపి నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.6 లక్షల విలువైన 21 ఖరీదైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని గోల్కొండ జోన్ డీసీపీ  జి. చంద్ర మోహన్ వెల్లడిం చారు. అరెస్టయిన నిందితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ నోనియా, గౌరవ్ నోనియా, జార్ఖండ్‌కు చెందిన పరణ్ కుమార్, దేవా కుమార్‌గా గుర్తించామని అన్నారు.. ఈ ముఠాకు సూత్రధారి అయిన సాగర్ కుమార్ నోనియా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు  తెలిపారు.

వేషధారణతో మోసపూరితంగా నేరాలు

నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చి టీ స్టాల్స్, చాట్ బండార్‌లు, కూరగాయల వ్యాపారుల వేషాలు వేసుకుని రద్దీ ప్రాంతాలను గమనించడం వీరి ప్రధాన వ్యూహంగా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, జనసంచారం ఎక్కువగా ఉండే కూడళ్ల వద్ద ఒంటరిగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని వారి చేతుల్లోని ఖరీదైన మొబైల్ ఫోన్లను లాక్కొని పరారయ్యేవారు.స్నాచింగ్ అనంతరం ఫోన్లను వెంటనే సిమ్ కార్డులు తొలగించి సాగర్ కుమార్‌ అనే నిందితుడికి అప్పగించేవారని పోలీసులు తెలిపారు. 

అతడు వాటిని ఇతర రాష్ట్రాల్లో విక్రయించి డబ్బులు సమకూర్చేవాడని గుర్తించారు. అయితే ఈ ప్రధాన నిందితుడి అయినా సాగర్ కుమార్‌ నేరాలకు పాల్పడుతున్న నిందితులకు ప్రతిరోజూ వెయ్యి రూపాయల చొప్పున వేతనం ఇచ్చి నేరాలకు ప్రోత్సహించేవాడని విచారణలో తేలింది. మెహదీపట్నం ఇన్‌స్పెక్టర్ ఎస్. మల్లేష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రాంబాబు నేతృత్వంలోని క్రైమ్ టీమ్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం సమయంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 

అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.6 లక్షల విలువైన 21 మొబైల్ ఫోన్లు, రూ.1,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో నమోదైన స్నాచింగ్ కేసులకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు.

ముఠా ప్రధాన సూత్రధారి సాగర్ కుమార్ నోనియా కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. అతడిని త్వరలోనే అరెస్ట్ చేసి మొత్తం నెట్‌వర్క్‌ను బయట పెడతామని స్పష్టం చేశారు. నగర ప్రజలు రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు. మెహదీపట్నం పోలీసుల చురుకైన చర్యతో నగరంలో కొనసాగుతున్న సెల్‌ఫోన్ స్నాచింగ్ ముఠాకు చెక్ పడినట్లు భావిస్తున్నారు.
 

By
en-us Political News

  
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.