వ్యక్తుల ఇమేజ్ కాదు.. రాజముద్రకే ఇంపార్టెన్స్

Publish Date:Jul 30, 2024

Advertisement

ఏపీ ప్రభుత్వం పథకాలకు పేర్లు మార్చింది. ఒక లక్ష్యంతో వ్యక్తుల ఇమేజ్ కాకుండా, మహానుభావుల పేర్ల మీదుగా పథకాలు ఉండాలన్న సదుద్దేశంతో ఈ మార్పు చేసింది.  గత ప్రభుత్వం అన్ని పథకాలకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ పేర్లు పెట్టింది. పేర్ల మార్పు యోచనలో లోకేష్ ఉన్నట్లు తెలియగానే అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   మహనీయుల పేర్లను ఆయా పథకాలకు  పెట్టాలని, సూచించారు.  
 విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆ సూచనను చాలా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు.  లోకేష్ విద్యా శాఖలో తనదైన ముద్ర వేసుకోవాలని కృషి చేస్తున్నట్టు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆయన గత వైసీపీ ప్రభుత్వం తాలూకా గురుతులు అనేవి లేకుండా నిర్వీర్యం చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా అనేక పధకాలకు 'జగనన్న' అని పేరు తగిలించడంతో పాటుగా ఏకంగా ఆయన ఫోటోని వాటికి తగిలించింది. జగన్ పేరు మారుమోగాలనే తపనతోనే వారు ఇలా చేశారన్నదాంటో ఎటువంటి సందేహం లేదు.  
అయితే  జగన్ పేరు, ఫొటో పిచ్చి గీత దాటిపోయి రోత పుట్టేస్థాయికి చేరిందని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నే   టీడీపీ కూటమి సర్కార్ జగన్ పేర్లను, ఫోటోలను తొలగించి వాటి స్థానంలో  ఆంధ్ర ప్రదేశ్ రాజ ముద్రని వేస్తున్నది. తెలుగుదేశం కూటమి సర్కార్ కూడా  వైసీపీ లాగా అలోచించి పథకాలకు పేర్లు పెట్టి ఉంటే  రెంటికీ తేడా లేదన్న విమర్శలు వచ్చేవి. కానీ లోకేష్ అలా చేయలేదు.. ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం లోగోని ఎంచుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి.
మరోవైపు.. ఆయన తన శాఖలో అరడజను పైగా ఉన్న పథకాలకు జగన్ పేర్లని తొలగిస్తూ లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ పేరు తొలగించి ఆయా పథకాలకు స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టడం పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి.  జగనన్న అమ్మ ఒడి పధకం పేరుని తల్లికి వందనం అని, జగనన్న విద్యా కానుక పధకానికి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ విద్యార్ధి మిత్ర అని, జగనన్న గోరుముద్ద పధకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని, మన బడి నాడు మన బడి నేడు అన్న పధకానికి మన భవిష్యత్తుగానూ, స్వేచ్చ అన్న దానికి బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు అన్న పధకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేర్లు మార్చారు.  ఈ మార్పు పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి.  

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.