కమ్మ కులంపై ‘రోత’ సాయిరెడ్డి దాడి ఎవరికి నష్టం?
Publish Date:Jul 30, 2024

Advertisement
(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)
కమ్మ కులం.. కమ్మకులం.. అని చెవులు కోసిన మేకలా అరుస్తున్న విజయసాయిరెడ్డి కులమేంటి? పేరు చివర ‘రెడ్డి’ అని తగిలించుకున్న ప్రతి ఒక్కరూ రెడ్డి కాదు అనేదానికి చారిత్రక సజీవ సాక్ష్యాలు, కోటి ఉదాహరణలు వున్నాయి. గడచిన పది సంవత్సరాలుగా కమ్మకులంపై కాలకూట విషప్రచారం చేసి, 2019 ఎన్నికలలో లబ్దిపొందిన జగన్ రెడ్డి గడచిన ఐదు సంవత్సరాల జగన్ పాలనలో అదే విష ప్రచారం పెద్ద ఎత్తున ఒక ప్రణాళికాబద్ధంగా చేశారు. ఎంత విషప్రచారం చేసినా, నిజం అనేది ఒకటి వుంటుంది. ఆంధ్రులు ఆ నిజం గ్రహించారు. అంతకుముందు ఎన్నడూ అఖండ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ జరగని మార్పు, తీర్పు ప్రజలు ఏకపక్షంగా ఇచ్చేశారు. కులంలేదు, మతం లేదు, ప్రాంతం లేదు.. అందరూ ఒక్కటై నాడు బ్రిటీష్ బానిస సంకెళ్లు తెంచడానికి ఉద్యమించిన దేశ ప్రజల మాదిరి ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛ, స్వతంత్రం కోసం తెలుగునాడు ఏకమయింది. మళ్ళీ అదే తప్పుడు పని ఏ2 విజయసాయిరెడ్డి ఎందుకు చేస్తున్నారు? తన జైల్ మేట్ ఏ1 జగన్ రెడ్డిని రాజకీయంగా నష్టపరచాలని సాయిరెడ్డి కోరుకుంటున్నారా? కమ్మ కులం మీద అదే ఏకపక్ష దాడిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ పరిశీలకులు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో తిరుమల నుంచి తాడేపల్లి వరకు కేవలం రెడ్లతో నింపేసిన జగన్ పాలనను మళ్ళీ మళ్ళీ గుర్తుచేయడానికి, సజ్జలకు, సాయిరెడ్డికి మధ్య యుద్ధం వల్ల సాయిరెడ్డి రాంగ్ రూట్ ప్రయాణం అంతిమంగా జగన్‌ని నష్టం చేస్తుందని పరిశీలకులకు అభిప్రాయపడుతున్నారు.
ఈమధ్యకాలంలో సాయిరెడ్డి రోతపనుల ఆరోపణల వెనుక తన పార్టీవారి హస్తం వుందని సాయిరెడ్డి ఆరోపించారు. పత్రికా సమావేశాల్లో కల్లుతాగిన కోతిలాగా చిందులు వేశారు. సజ్జలకి సాయిరెడ్డి మీద, భారతిరెడ్డి మీద వున్న అంతులేని కోపం జగన్ రెడ్డిని ముంచేస్తుందని, పదేపదే కమ్మ కులంపై దాడి జగన్ రెడ్డికి రాజకీయ నష్టంతోపాటు మా రెడ్డి సామాజికవర్గానికి తీవ్ర నష్టం చేస్తుందని తలపండిన ఒక రెడ్డి వ్యాఖ్యానించారు. సాయిరెడ్డి, జగన్ రెడ్డి మా రెడ్డి కులానికి ప్రతినిధులు ఎలా అవుతారు? వారు రాజకీయ నాయకులు మాత్రమే. మహా అయితే జగన్ పాలనలో ఒక వెయ్యి మంది రెడ్లు లాభపడి వుండొచ్చు. కానీ, యావత్ రెడ్డి సమాజం నష్టపోయింది అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా తలపండిన రాజకీయ నాయకుడే కదా.. చంద్రబాబుకు కులపిచ్చి ఎందుకు వుంటుంది? అందునా భయస్తుడు. తాను పంచుకునే వేదిక మీద కూడా ఇతర కులాల వాళ్ళు వుండేలా చంద్రబాబు జాగ్రత్తపడతారు. జగన్ పాలనలో చుట్టూ రెడ్లతో నింపేసి, నేడు టీటీడీలో ఒక అధికారిని నియమించినందుకు సాయిరెడ్డి చేసిన రచ్చ కుట్రపూరితం అనేది సుస్పష్టం. నష్టం మాత్రం కచ్చితంగా జగన్మోహన్‌రెడ్డికే.
రాజకీయాలు ఎంత వికృతంగా వుంటాయి అనేది తెలుసుకుందాం. రాజకీయ నాయకుల కులం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గతం నుంచి నేటి వరకు వైసీపీ చేస్తున్న, చేసిన ఆరోపణల్లో ఊతపదం ‘చంద్రబాబు సామాజికవర్గం’ అని మొదలుపెడతారు. అంటే, మొత్తం కులానికి ఆపాదించడం అన్నమాట. ఒక సామాజికవర్గాన్ని నిందించడం. అలాంటి ఉదాహరణలు చరిత్రలో ఒకటి, రెండు చూద్దాం. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం కారణంగా మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగుజాతి విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు వైశ్య సామాజికవర్గానికి చెందినవారు. మరి, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి వైశ్యుడు అవ్వాలి కదా? అయ్యారా? ప్రకాశం పంతుల్ని పదవి నుంచి దింపేవరకు నిద్రపోలేదు నాటి రాజకీయ రెడ్లు. 70 సంవత్సరాల క్రితం బెజవాడ - గుంటూరు మధ్య రావలసిన ఆంధ్రప్రదేశ్ రాజధానిని కర్నూలు గుడారాల్లోకి ఎవరు తీసుకెళ్ళారు? అక్కడ్నుంచి అదే రెడ్లు హైదరాబాద్‌కి ఎందుకు తీసుకెళ్ళారు? ఏ రాజకీయ రెడ్లు నడిపే పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది? ప్రాంతీయ విద్వేషాలకు కారణమైన రెడ్ల పార్టీ ఏది? 1983 వరకు రెడ్లే అధికారం చెలాయించారు. ఒకరిద్దరు తప్ప దాదాపు ముఖ్యమంత్రులందరూ రెడ్లే. 60 మంది మంత్రుల్లో 45 మంది రెడ్లు. ఆరోజు ఎవరికీ కులసమస్య గుర్తుకు రాలేదు. వచ్చినా తెలియదన్నట్టు నటించారు. ఎన్టీఆర్ గెలవగానే ‘కమ్మ కులం’ అని అకస్మాత్తుగా అందరికీ గుర్తుకొచ్చింది. అదేంటీ? రెడ్డి వుండాలిగానీ, మరో కులమా అని అందరూ వాపోయారు. మళ్ళీ ఎన్టీఆర్ ఓడిపోగానే నలుగురు రెడ్లు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డారు. చెన్నారెడ్డి, జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి. ముఖ్యమంత్రి పదవి కోసం అష్టాచెమ్మా ఆటలు ఆడినా, లేని మతకలహాలు సృష్టించి అమాయకులను చంపించినా, వికృత రాజకీయాలు చేసినా... అవి చేసింది రాజకీయ రెడ్లే! ప్రజల్లో ఆ నలుగురేనా నాయకులు? వేరే కులాల్లో రాజకీయ నాయకులు లేరా? కాపుల్లో లేరా? కాంగ్రెస్ పార్టీ ఒట్టిపోయిందా? అనే స్పృహ ప్రజల్లో రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇక్కడ మనం రెడ్డి కులం మొత్తాన్నీ బాధ్యులను చేద్దామా? జరిగిన చెడును రెడ్డికులం మొత్తానికీ అంటగడదామా?
రెడ్డి కులం వేరు... రాజకీయ రెడ్లు వేరు! అలాగే రాజకీయ కమ్మ వేరు.. కమ్మ కులం వేరు. జగన్‌రెడ్డికి కులపిచ్చి వుందని అనుకోవడం లేదు. కేవలం ఒక వెయ్యి మందికి ప్రజల సొమ్ము పప్పూబెల్లాల్లా పంచినంత మాత్రాన రెడ్డి కులానికి ఒరిగిందేమీ లేదు. జగన్ పాలనలో వాళ్ళు కూడా బాధితులే కదా! నిరుపేద రెడ్లు ఎంతమంది లేరు? రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు లేవా? దశాబ్దాలుగా కమ్మకులంపై ఏకపక్ష దాడి జరుగుతుంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకూ ఎవరైనా గట్టిగా ప్రశ్నించారా? మా కులంపై ఏమిటీ దాడి అని నిలదీయడం మీరు చూశారా? అది కుదరనిపని. వారు కమ్మ, రెడ్డి, కాపు, మరేదో కాదు.. వారందరికీ ఒకటే కులం... రాజకీయ కులం! పిసుక్కునేది, ఆవేశపడేది, అనారోగ్యం పాలయ్యేది ఆయా కులాల్లో పేదలు, మధ్యతరగతి వర్గాలు మాత్రమే. ఏ కులమైనా ధనవంతులది ఒకటే కులం... ‘ధనకులం’! పరువు హత్యలు పేద, మధ్యతరగతిలోనే వుంటాయి తప్ప ధనరాశులు పోగేసుకున్నవారి మధ్య కులం వుండదు. వారు సంబంధాలు కలుపుకుంటారు. హైక్లాస్ కిట్టీపార్టీలు చేసుకుంటారు. వారందరిదీ ఒకటే క్లాస్.. హైక్లాస్.
టీడీపీ పాలనలో ఎర్రంనాయుడు, లాల్ జాన్ బాషా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి, ప్రతిభా భారతి, దేవేందర్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేసీఆర్, బాలయోగి, ఆనందగజపతి.. ఇలా అనేక కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వారు కూడా పైకి ఎదిగి వచ్చారు. పైన చెప్పిన వారిలో ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కులం కాదు. రాజకీయ రెడ్డి జగన్ రెడ్డి రాగానే, అన్నీ ఎవరికి ఏమేం పంచిపెట్టారో ‘రోత’ విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి.
13 వైస్ ఛాన్సలర్లలో నాటి టీడీపీ ప్రభుత్వం సమతూకంతో అన్ని కులాలకూ సమానంగా పంచితే, జగన్ 13 మందిలో 11 మంది రెడ్లకు అప్పనంగా కట్టబెట్టి విశ్వవిద్యాలయాల్లో కుల కంపుకు కారణమయ్యారు. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అన్నట్టు ఈ ‘పిచ్చి’ కులరెడ్డి నిత్యం పేదలకు, పెత్తందార్లకు యుద్ధం అని అంతులేని వేదనతో రోదిస్తూ వుంటారు. తండ్రిలేని పిలగాడు. ఆ ముఖం చూడండి.. అంతులేని అమాయకత్వం. ఆ దేవుడు తండ్రికి దూరం చేసి మీ బిడ్డకు అన్యాయం చేశాడు. నాన్న చనిపోయి దేవుడయ్యాడు అనే ఆనందంలో వుండగా తప్పనిసరి పరిస్థితుల్లో మీ బిడ్డ బాబాయ్‌ని కూడా పోగొట్టుకున్నాడు అధ్యక్షా. ఒక కన్నును ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్షా?... ఇవి.. నాటి చిలక పలుకులు!
గుర్రం జాషువా ఇలా అన్నారు... ‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు.. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు. పస లేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు. జనులంతా ఒకే కుటుంబం.. జగమంతా ఒక నిలయం’. కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం నాటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. వంగవీటి రంగా హత్యకు చంద్రబాబును బాధ్యుణ్ణి చేస్తూ, అందుకు ఆయన్ని వర్గ శత్రువుగా భావిస్తున్నారని, కుప్పం బహిరంగసభలో జగన్ రెడ్డి నాడు మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో వుండి, ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటివి మాట్లాడకూడదన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ఆయనకు లేదు. నిరాధారమైన ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి, రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడానికే ఇంతలా దిగజారారు. 1988 మార్చి 10వ తేదీన దేవినేని మురళి హత్య జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా జరిగిన మొట్టమొదటి రాజకీయ హత్య దేవినేని మురళిదే కావడం విశేషం. అంతకుముందు జరిగిన హత్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండగా జరిగిన హత్యలే. 1988 డిసెంబర్ 26న జరిగిన రంగా హత్యను తన రాజకీయ అవసరాల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి కుట్రపూరితంగా రాజకీయ అస్త్రంగా వాడారు. ఇద్దరు వ్యక్తులు, రెండు ముఠాల మధ్య జరిగిన ఘర్షణలను రెండు కులాలకు ఆపాదించి విధ్వంసం సృష్టించారు. వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తులు ధ్వంసం చేశారు. ఆనాడు తండ్రి సృష్టించిన కులాల కుంపట్లు ఆరిపోకుండా జగన్ రెడ్డి రాజేస్తూ వస్తున్నారు.
తెలుగుదేశం పార్టీయే రంగాను హత్య చేయించి వుంటే... రంగా భార్య, కుమారుడు వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఎందుకున్నారు? రాధా సైతం నా తండ్రి హత్యకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని గతంలో స్పష్టం చేశారు కూడా. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ని పక్కన కూర్చోబెట్టుకుని రంగా హత్య గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొంటూ దేవినేని నెహ్రూపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాపులపై నిజంగా ప్రేమ వుంటే కాపు కార్పొరేషన్‌కి నిధులు ఎందుకు కేటాయించలేదు జగన్మోహన్‌రెడ్డి? చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. కానీ, జగన్మోహన్‌రెడ్డి వాటిని కొనసాగించకుండా నాటకాలు ఆడారు. నిజాలను చెరిపేసి, అబద్ధాలను వండివారుస్తూ ఎదురుదాడి చేయడం జగన్‌రెడ్డికే చెల్లుతుంది. రంగా కేసు గుర్తుకొచ్చినప్పుడు, సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎందుకు గుర్తుకురావడం లేదు?
వైఎస్ వివేకా రక్త చరిత్రకు ఐదేళ్ళు నిండాయ్. మొదట గుండెపోటు.. కాదు చంద్రబాబే హత్య చేయించాడని ప్రచారం చేశారు. రంగా హత్యకు రెడ్డిగారి సాక్ష్యం. రంగా హత్య అనే ఒకే ఒక్క కారణంగా జగన్మోహన్ రెడ్డి పుట్టి పెరిగిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రంగా హత్యపై సీబీఐ ఎంక్వయిరీ వేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. మరి, హంతకులను ఎందుకు శిక్షించలేదు? తెలుగుదేశం - జనసేన పొత్తు.. కమ్మ, కాపు కలయిక ఇష్టపడని ఏకైక వ్యక్తులు.. రాజకీయ రెడ్లు! రంగా హత్య తర్వాత మొసలి కన్నీరు కార్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు నెహ్రూను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 2004 సంవత్సరంలో కోట్ల రూపాయల విలువైన స్థలం వైఎస్సార్ కట్టబెట్టారన్న ఆరోపణలు వున్నాయి. నెహ్రూ చంద్రబాబును, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తిట్టినట్టు ఇప్పటి వరకూ ఎవ్వరూ తిట్టలేదు. ఎన్టీఆర్ సంతానం పంది సంతానం అని, వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడితో సమానమని ఎవరికోసం, ఎందుకు నెహ్రూ అంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు? నేడు అతని కుమారుడు అవినాష్ తన రౌడీ మూకలతో టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై ఎవరి కోసం దాడి చేయించారు? వంగవీటి రంగాను తాచుపాముతో పోల్చి, కరవడానికి వచ్చి దేవుడి పటాల వెనుక వెళ్ళిదాక్కుంటే చంపకుండా వుంటామా అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్‌రెడ్డి బంధువు పూనూరు గౌతమ్ రెడ్డికి ఏపీ ఫైబర్ ఆప్టిక్ ఛైర్మన్ పదవి కట్టబెట్టి, దోచుకోవడానికి అవకాశం కల్పించిందెవరు? పరిటాల రవి పవన్‌కళ్యాణ్‌కి గుండుకొట్టించాడని రాయలసీమ పెత్తందారు ఎందుకు విషప్రచారం చేశారు? రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి నిర్మించిన ‘రక్తచరిత్ర’ సినిమాలో ఒక నటుడికి గుండుకొట్టించే సన్నివేశం ఎందుకు చిత్రీకరించారు? పరిటాల హత్య తర్వాత ఖాదర్ మొహీయుద్దీన్ అనే ఒక సీనియర్ జర్నలిస్టు 20 సంవత్సరాల క్రితం ‘అస్తమించిన రవి... ఒక ఉద్యమ వీరుడి ఊపిరియాత్ర’ పేరుతో పరిటాల రవి జీవిత చరిత్ర రాయడం జరిగింది. ఆ పుస్తకంలో రవి, తన జీవితకాలంలో పవన్ కళ్యాణ్‌ని కనీసం ఒక్కసారి కూడా చూడలేదు. అది ఒక వర్గం కట్టుకథ అని తెలియజేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని రవి మొదటి వర్ధంతి రోజున కుటుంబ సభ్యుల సమక్షంలో నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేతుల మీదుగా పుస్తకావిష్కరణ 20 సంవత్సరాల క్రితం జరిగింది. 2019లో పవన్ కళ్యాణ్ పరిటాల రవి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే, నాటి కాంగ్రెస్ పార్టీలో వంగవీటి రంగా ఎదుగుదల చూసి ఓర్వలేని ఒక రాయలసీమ నేత, రంగా బతికి వుండగా నేను ముఖ్యమంత్రిని కాలేను అని భావించిన వ్యక్తి పన్నిన పన్నాగంలో భాగంగా రెండు కుటుంబాల మధ్య గొడవలను కులాలకు ఆపాదిస్తూ ఆనాటి దుర్ఘటనకు రాయలసీమ నుంచి మొదటిసారిగా విజయవాడకు బాంబులు సరఫరా చేసిందెవరు? కాపులను రాజ్యాధికారానికి దూరం చేస్తూ, విభజన సిద్దాంతంతో ఆరితేరిన రాజకీయ కుటుంబం ఏది? ఏ రెండు కులాలు కలిస్తే ఎవరికి నష్టం? కులాలుగా విభజిస్తూ నాటి నుంచి నేటి వరకు ఏ కులం రాజకీయ పార్టీ ముసుగులో ఇంత వికృత రాజకీయ జరుపుతోంది? ఒక కులాన్ని రైళ్ళు తగలబెట్టేదిగా ప్రశాంత కోనసీమలో ‘మంటసీమ’ను చిత్రీకరించడం కోసం జరిగిన దుర్ఘటనలో ఎవరి కుట్ర వుంది? ఆనాడు బెజవాడను తగులబెట్టింది రంగా హత్యకు ముందుగానే రాయలసీమ నుంచి దిగుమతి చేసుకున్న కిరాయి మూకల దమనకాండకు... చెన్నారెడ్డిని పదవి నుంచి దించడానికి హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించి వందలాది మంది ప్రాణాలు పోవడానికి కడప కత్తులే సాక్ష్యం!
http://www.teluguone.com/news/content/jounalilst-laundry-jagan-39-181777.html












