వాంటెడ్ లిస్టులో మద్యం బినామీలు
Publish Date:Mar 26, 2012
Advertisement
బినామీ పేర్లతో మద్యం దుకాణాలను కోట్లాది రూపాయలకు పాడుకున్న వ్యక్తుల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది మద్యం వ్యాపారులు తమ దగ్గర పనిచేసే కారు డ్రైవర్లు, గుమస్తాలు, లేదా చిరు ఉద్యోగుల పేరుతో మద్యం దుకాణాలను నెలకొల్పారు. కాసుకు ఠికానా లేని ఈ వ్యక్తులకు కోట్లాది రూపాయల ఆస్తులున్నట్లు రికార్డుల్లో చూపించి వారి పేరిట మద్యం దుకాణాలు పాడుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా వీరికి షాపు గుమస్తాలుగానూ, మరో ఉద్యోగిగానో ఉపాధి కల్పించారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే మద్యం షాపులపై ఎసిబి దాడులు జరపడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. నిత్యం లక్షల్లో లాభాలు ఆర్జించిన మద్యం షాపు యజమానులు ఇప్పుడు నష్టాలపాలై షాపులను మూసేస్తున్నారు. లైసెన్స్ పొందిన 17 నెలల తరువాత వీరు ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు తొలుత వ్యాపారులు బ్యాంక్ గ్యారంటీగా ఇచ్చిన సొమ్మును తామ వాయిదాలకు సరిపెట్టడానికి డ్రా చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖకు డబ్బు చెల్లించిన బ్యాంకులు లైసెన్స్ హోల్డర్లపై వాయిదా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లైసెన్స్ హోల్డర్లలో అత్యధికులు పేద, మధ్యతరగతి వర్గీయులు. ఏదో ఉపాధి దొరుకుతుందని ఆశించి బినామీలుగా మారిన ఈ పేద జనం ఇప్పుడు బ్యాంకుల నుంచి వస్తున్నా ఒత్తిడితో లబోదిబోమంటున్నారు. లక్షల్లో ఉన్న బకాయిల చెల్లింపు విషయమై వీరు తమ యజమానులను అడిగితే వారినుంచి సరైన సమాధానం రావడం లేదు. దీంతో ఈ బినామీలంతా రాత్రికి రాత్రే మాయమైపోతున్నారు. బ్యాంకు అధికారులు వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కొందరయితే తమకు ఏ పాపం తెలియదని, తమ యజమానులు చెప్పినట్లే చేయడం వల్ల తమకు ఈ తిప్పలు వచ్చాయని, తమను ఆదుకోవాలంటూ జిల్లా ఎస్పీ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో బినామీ మద్యం వ్యాపారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
http://www.teluguone.com/news/content/liquor-syndicate-24-12922.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





