పశ్చిమ' కాంగ్రెస్ తీరుపై బొత్సా అసంతృప్తి
Publish Date:Mar 26, 2012
Advertisement
పశ్చిమగోదావరిజిల్లాలో కాంగ్రెస్ పార్టీ తీరు తెన్నులపై పిసిసి అధ్యక్షులు బొత్సా సత్యనారాయణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత ఈ జిల్లాలోని పార్టీ కెడర్ లో దాదాపు 70 శాతం ఆ పార్టీలో చేరిపోయింది. ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున చేరుతుండటంతో ఆ పార్టీ భవిష్యత్తు అయోమయంలో పడింది. డిసిసి అధ్యక్షుడుగా ఉన్న గోకరాజు రామం పార్టీని సరైన మార్గంలో నడిపించలేకపోతున్నారని బొత్సా అంటున్నారు. గోకరాజు రామం నోట్లో నాలుకలేని వ్యక్తి అని, పార్టీని కట్టడి చేసే సత్తా ఆయనలో లేదని జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగానే అంటున్నారు. అయితే ఈ జిల్లాలో కనుమూరి బాపిరాజువంటి నాయకులు పార్టీని అడ్డుపెట్టుకుని పదవులు అనుభవిస్తున్నారే తప్ప పార్టీ అభివృద్ధికి కృషి చేయడంలేదన్న అపవాదులని కూడా ఎదుర్కొంటున్నారు. కనుమూరి బాపిరాజు కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం నుంచి ఉన్నారు. ఆయనెంతసేపూ తన పదవి గురించి ఆలోచించుకుంటారు తప్ప పార్టీ గురించి ఆలోచించరని కార్యకర్తలు అంటున్నారు. పార్లమెంట్ సభ్యుడుగా ఆయన జిల్లా అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదని ఇప్పుడు టిటిడి చైర్మన్ కావడంతో ఆయన పూర్తి సమయాన్ని తిరుపతిలోనే గడిపేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసిసి అధ్యక్షుడు గోకరాజు రామం కనుమూరి బాపిరాజుకు అత్యంత సన్నిహిత బంధువు కూడా అవుతారు. పార్టీ పగ్గాలు ఒకరిచేతిలోనూ, పదవులు మరొకరి చేతిలోనూ ఉన్నప్పటికీ ఈ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఏమీ చేయడంలేదన్న విమర్శలు రావడంతో బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగినట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/east-godawari-dist-congress-24-12923.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





