పసిపిల్లలు కోపాన్ని పసిగట్టేస్తారు

Publish Date:Dec 6, 2016

Advertisement

పసిపిల్లల ముందు కోపంగా ఏదన్నా ఒక మాట అంటే... వారు ఒక్క క్షణం బిత్తరపోవడాన్ని గమనించవచ్చు. ఇంకా పారాడే పసిపిల్లలే కదా! వారికి మన మాటల్లోని కోపం, ఉద్రిక్తత, చిరాకు, సంతోషం, ప్రేమ... వంటి అనుభూతులు ఎలా తెలుస్తాయి? అనుకోవడానికి వీల్లేదు. పసిపిల్లలకు ఇంకా భాష రాకపోయినా భావం తెలిసిపోతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.

భాష - భావం

మనం ఏ భావంతో మాట్లాడుతున్నామన్న విషయాన్ని పిల్లలు ఎంతవరకు గ్రహించగలుగుతారు అనే అనుమానంతో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వారు ఒకే తరహా వాక్యాన్ని వేర్వేరు ఉద్వేగాలతో పిల్లల ముందు పలికి చూశారు. అలా ఒకే వాక్యాన్ని వేర్వేరు రకాలుగా పలికినప్పుడు, పిల్లల మెదడులో ఎలాంటి ప్రతిస్పందనలు ఏర్పడుతున్నాయో గమనించేందుకు వారి మెదడుని స్కానింగ్ చేశారు.

పట్టేశారు

ఆశ్చర్యకరంగా వాక్యంలోని పదాలు మారకపోయినా... ఆ వాక్యాన్ని ఉచ్ఛరించిన తీరు ద్వారా పిల్లలు, ఆ మాట వెనుక ఉన్న ఉద్వేగాన్ని గమనిస్తున్నట్లు తేలింది. ఇది ఏమంత తేలికైన ప్రక్రియ కాదంటున్నారు పరిశోధకులు. ఎంత అధునాతనమైన రోబో అయినా కూడా తను వినే మాట వెనుక ఉన్న భావాన్ని గ్రహించడం కష్టమని అంటున్నారు. అలాంటి ఏడాది అయినా నిండని పసిపిల్లలు ఇలాంటి నేర్పు సాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

భారీ పరిశోధనలకు మూలం

పిల్లలు తాము వినే స్వరాల వెనుక దాగిన ఉద్వేగాలను గ్రహిస్తారన్న విషయం తేలిపోయింది సరే! మరి ఆ నేర్పు వారికి ఎలా అలవడుతుంది? ఏ లక్షణాల ఆధారంగా వారు శబ్దాలను విశ్లేషించగలుగుతున్నారు? అన్న విషయాల మీద ఇక పరిశోధన జరగవలసి ఉందట. దీని వలన భాషకు సంబంధించి, పిల్లల మెదడు ఎదిగే విధానానికి సంబంధించి, మనం ఉద్వేగాలను గ్రహించే తీరుని గురించి కొత్త విషయాలు తెలుస్తాయని ఆశిస్తున్నారు.

తస్మాత్ జాగ్రత్త!

పిల్లలోని ఈ నేర్పు వెనుక కారణాలు, దాని వలన ఉపయోగాలు గురించి శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు పరిశోధించేలోపల మనం గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. పసిపిల్లలే కదా! వారికేం తెలుస్తుందిలే అని వారి ముందు ఎడాపెడా ప్రవర్తించడానికి వీల్లేదు. వారు నిస్సహాయులు కాబట్టి తిరిగి మనల్ని ఏమీ అనలేరు అని విరుచుకుపడటం భావ్యం కాదు. ఏమో వాళ్లేం గ్రహిస్తున్నారో ఎవరికి తెలుసు? వారి మనసులో ఎలాంటి అభిప్రాయాలు రూపొందుతున్నాయో మనమెలా ఊహించగలం? అందుకే, పిల్లల ముందు కూడా తస్మాత్ జాగ్రత్త!

- నిర్జర.

 

 

By
en-us Political News

  
చైనాలో బరువు తగ్గడం కోసం తొలిసారిగా ఓరల్ జీఎల్పీ 1 మాత్ర ఓర్ఫోగ్లిప్రాన్ ఆమోదం పొందింది. ఎలి లిల్లీ సంస్థకు దక్కిన ఈ చారిత్రాత్మక మైలురాయి, క్లినికల్ ట్రయల్స్ విశేషాలు మరియు భవిష్యత్తు అంచనాల పూర్తి సమాచారం.
వ్యాయామం లేదా శారీరక శ్రమ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? కాలేయం పాత్ర, హార్మోన్ల ప్రభావం మరియు మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం.
చలికాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు, ప్రోటీన్, ఫైబర్ లాభాలు మరియు రోగనిరోధక శక్తిని పెంచే రహస్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వారానికి ఒక్కసారైనా పార్కులకు వెళ్లడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం ఎంతగా మెరుగుపడుతుందో తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.
క్యాన్సర్ చికిత్సలో వస్తున్న సరికొత్త వైద్య విప్లవాలు మరియు అత్యాధునిక ట్రీట్‌మెంట్ విధానాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
గుండె జబ్బులు ఉన్నవారికి స్టెంట్‌లు లేదా బైపాస్ సర్జరీలు నిజంగా ప్రాణాలను కాపాడుతాయా? 25 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైన సంచలన విషయాలు మరియు వైద్య నిపుణుల హెచ్చరికల పూర్తి సమాచారం.
రోజూ ఒక గ్లాసు బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు బీపీ నియంత్రణ, కిడ్నీల ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ సంబంధాలలో ఒకరికొకరు సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో, ఎవరి వ్యక్తిగత జీవితానికి వారు కొంత వ్యక్తిగత సమయం లేదా స్పేస్ తీసుకోవడం కూడా అంతే అవసరం.
మనం నిత్య జీవితంలో గమనిస్తే కొందరి దగ్గర డబ్బు బాగా ఉంటుంది కానీ నలుగురిలో వారికి ఎలాంటి గౌరవం దక్కదు.
చలికాలంలో క్యాప్సికమ్ తింటే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి? మలబద్ధకం నివారణ, బరువు నియంత్రణ మరియు ఇమ్యూనిటీ పెంచడంలో క్యాప్సికమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
చలికాలంలో వేడివేడిగా నల్ల శెనగ గుగ్గిళ్లు తింటే కేజీ మటన్, పాలు తాగిన దానికంటే ఎక్కువ శక్తి లభిస్తుంది. నల్ల శెనగల్లోని పోషకాలు, కేలరీలు మరియు ఆరోగ్య లాభాల గురించి పూర్తిగా తెలుసుకోండి.
కంటిచూపును సహజంగా మెరుగుపరచుకోవడానికి, కళ్ళద్దాలను వదిలించుకోవడానికి మునగాకు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎలా సహాయపడతాయో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
చలికాలంలో వేడివేడిగా తినుటకు అనువైన క్రిస్పీ క్యాప్సికం బజ్జీల తయారీ విధానం మరియు వాటి ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.