మునుగోడు పై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ ఎందుకంటే?

Publish Date:Oct 15, 2022

Advertisement

ఉప ఎన్నికల దేముంది, వస్తుంటాయి, పోతుంటాయి. ఒక అసెంబ్లీ నియోజక వర్గంలో తెరాస ఓడిపొతేనో బీజేపీ గెలిస్తేనో ప్రభత్వం ఏమన్నా కూలిపోతుందా? ఉపఎన్నికల్లో గెలుపు ఓటములతో వచ్చేది లేదు. పోయేది లేదు.. ఈ మాటలన్నది ఎవరో గుర్తుందా ? ఎస్, ఇప్పడు మునుగోడులో తెరాస అభ్యర్ధి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే, నియోజక వర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ  ఇచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆరే.  గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగానూ ఈ వ్యాఖ్య చేశారు.  నిజానికి కేటీఆర్ ఇంతకు ముందు ఎప్పుడూ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన లేదు. 

 ముఖ్యమంత్రి కేసీఆర్, ఇజ్జత్’కి సవాల్ గా తీసుకుని బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా  కోట్లాది రూపాయలు కుమ్మరించి  కొట్లాడిన హుజురాబాద్ హుజురాబాద్ ఉప ఎన్నిక విషయాన్నే తీసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్యనాయకులు హుజురాబాద్ ఉప ఎన్నికకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని  ఒక విధంగా అవహేళనా చేశారు.

 నిజానికి ఒక్క హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనే కాదు, అంతకు ముందు తర్వాత జరిగిన హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను  కూడా కేటీఆర్ లైట్ గా తీసుకున్నారు. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కానీ  అదే కేటీఆర్  మునుగోడు ఉపఎన్నికలో  బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. పరుగులు తీస్తున్నారు.  
నిజానికి ముఖ్యమంత్రి కేసేఆర్  మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతను ఏ ఒక్కరికో అప్పగించలేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా సుమారు ఓ వంద మందికి  మునుగోడులో పార్టీ అభ్యర్ధిని గెలిపించే బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడులో తమకు పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

తమ పరిధిలో  మెజార్టీ ఓట్లు సాధించడం కోసం పని చేస్తున్నారు. మరో వంక మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డితో పాటుగా కేటీఆర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్  సమన్వయ బాధ్యతలు మాత్రమే అప్పగించారు. అయినా, జిల్లా మంత్రిగా జగదీష్ రెడ్డి, ముందు నుంచి తమదైన పద్దతిలో ప్రచారం సాగిస్తున్నారు. మరో వంక హరీష్ రావు, ఇంకా పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వలేదు.  పొరుగు రాష్ట్రం ఏపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, మంత్రులకు, గడప గడపకు పరీక్ష పెడితే, తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెలకు మునుగోడు పరీక్ష పెట్టారు. సరే  ఆ పరీక్షలో ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అనే విషయం పక్కన పెడితే, హుజురాబాద్ లో కూల్ గా ప్రచారానికి దూరంగా ఉన్న మంత్రి కేటీఅర్ మునుగోడు ఉప ఎన్నిక పై ఎందుకు దూకుడు పెంచారు? అదే సమయంలో హుజురాబాద్ బాధ్యత  మొత్తం భుజానికి ఎత్తుకుని దూకుడుగా ప్రచారం సాగించిన హరీష్ రావు మునుగోడు విషయంలో ఎందుకో అంటీ ముట్టనట్లుగా ప్రకటనలకు మాత్రమే పరిమిత మయ్యారు.  ఈ నేపథ్యంలోనే   మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం హాట్ టాపిక్‌గా మారింది.

అయితే  దుబ్బాక హుజురాబాద్ వరస ఓటముల తర్వాత హరీష్ రావు ఇమేజ్ కొంత మేర డ్యామేజ్ అయ్యింది. అందుకే అంతవరకు ట్రబుల్ షూటర్ గా గుర్తించి కీలక బాధ్యతలను ఆయనకే అప్పగించిన కేసేఆర్, మునుగోడులో వ్యూహం మార్చి హరీష్, కేటీఆర్ ఇద్దరికీ సమన్వయ బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అదీ కాకుండా దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికకు చాలా  వ్యత్యాసం ఉందని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ లాంటిదని  ఇక్కడ ఓడిపోతే,  బీజేపీని ఎదుర్కోవడం కష్టమవుతుందని అంటున్నారు. ఇక్కడ గెలిచి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదే అనే ప్రచారంతో దూసుకు పోయేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఈ ఉప ఎన్నికను తెచ్చింది.

ఈ క్రమంలో టీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంది. అందులో భాగంగానే, ఇప్పటికి  కాకున్నా రేపటి అసెంబ్లీ ఎన్నికలలో తెరాస మరో మారు గెలిస్తే  ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న కేటీఅర్ మునుగోడు మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని అంటున్నారు. అయితే మునుగోడు ఫలితం కేటీఆర్ కలలను నిజం చేస్తుందా? హుజురాబాద్’ రిపీట్ అవుతుందా చూడవలసి ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.