కవిత టిఆర్ఎస్ పసుపు జెండా.. వ్యూహమేంటి?!

Publish Date:Jun 1, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సంచలనం రేగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె, కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఆమె 'తెలంగాణ రక్షణ సమితి' (TRS) పేరుతో సరికొత్త ప్రాంతీయ పార్టీని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే పార్టీ పేరు కంటే కూడా, ఆమె ఎంచుకున్న పార్టీ జెండా రంగు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతోంది. కవిత తన  టిఆర్ఎస్ పార్టీకి  పసుపు  రంగును అధికారిక రంగుగా ప్రకటించడం సంచలనం సృష్టించింది.  పసుపు రంగు అనగానే అందరికీ గుర్తుకువచ్చేది తెలుగుదేశం పార్టీ. దీంతో రాజకీయ వర్గాల్లో రకరకాల కుట్ర సిద్ధాంతాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకప్పుడు గులాబీ జెండాతో నడిచిన కవిత, ఇప్పుడు పసుపు జెండాను ఎంచుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనే దానిపై జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

ఈ వివాదంపై..  పసుపు రంగు ఎంపికపై వస్తున్న విమర్శలపై కల్వకుంట్ల కవిత తాజాగా ఒక   టీవీ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.  పసుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ..  ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం  కాదని   తేల్చి చెప్పారు. ఈ రంగు ఎంపిక వెనుక రాజకీయ వ్యూహాల కంటే బలమైన సెంటిమెంట్ దాగి ఉందని ఆమె వివరించారు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలకు పసుపు రంగుతో విడదీయరాని,   ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందని గుర్తు చేసిన కవిత..  నిజామాబాద్ జిల్లాలో పండించే ప్రధాన పంట పసుపు (టర్మరిక్) అని, అక్కడి రైతులకు, ప్రజలకు ఈ రంగుతో విపరీతమైన సెంటిమెంట్ ఉందని వివరించారు. ఒకప్పుడు తాను పార్లమెంట్‌లో నిజామాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించానని, తన భర్త దేవనపల్లి అనిల్ కుమార్ సైతం నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పోతంగల్ గ్రామానికి చెందినవారేనని చెబుతూ తన నిజామాబాద్ బంధాన్నిచెప్పుకొచ్చారు.

కేవలం రైతు సెంటిమెంట్ మాత్రమే కాదు..  పసుపు రంగు ఎంపిక వెనుక ఒక బలమైన మహిళా సెంటిమెంట్ కూడా ఉందని కవిత చెప్పారు. . ఒక మహిళగా పుట్టినప్పటి నుండి చివరి శ్వాస వరకు ప్రతి ఆడబిడ్డ  పసుపు కుంకుమ' ఆశీర్వాదాలను ఎంతో పవిత్రంగా భావిస్తుందని, పసుపు కుంకుమలను కోరుకుంటుందని  అన్నారు. అందుకే ఒక మహిళగా పసుపు రంగు తన హృదయానికి ఎంతో దగ్గరైనదని, అందుకే తన కొత్త తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీకి ఈ రంగును ఎంచుకున్నానని  స్పష్టం చేశారు.

కవిత ఇంతటి స్పష్టమైన,  భావోద్వేగ వివరణ ఇచ్చినప్పటికీ, రాజకీయాల్లో ఈ పసుపు రంగుపై సాగుతున్న మైండ్ గేమ్స్ అంత సులభంగా ఆగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా బిఆర్ఎస్   శ్రేణులు ప్రతి చిన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో..  కేసిఆర్ సొంత రక్తమైన కవితను చంద్రబాబు ఏజెంట్ అని విమర్శించడం పరోక్షంగా కేసిఆర్‌ను అవమానించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

By
en-us Political News

  
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.