కేసీఆర్ ని కూడా మరిచి టీ కాంగ్ కేటీఆర్ తో యుద్ధం చేస్తోందా?

Publish Date:Jul 27, 2017

Advertisement


ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం ప్రధానంగా ఎవర్ని టార్గెట్ చేస్తుంది? ఉదాహరణకి ఏపీనే తీసుకుంటే… అక్కడ వైసీపీ నేతలంతా చంద్రబాబుని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే, ఆయన సీఎం కాబట్టి. సీఎంని విమర్శించటం ద్వారా మొత్తం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చు. దోషిగా చూపొచ్చు. అలాగే, దిల్లీలో అయితే ప్రతిపక్షాలు ప్రధానిని నిలదీస్తాయి. అలా చేయటం ద్వారా గవర్నమెంట్ మొత్తాన్ని జనం ముందు కార్నర్ చేయోచ్చు. కాని, తెలంగాణ కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది! దాంట్లోని మర్మమేంటో టీ కాంగ్ కే తెలియాలి!

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన నోరు తెరిచి తిట్టారంటే ప్రతిపక్షాలకు అది పరమ భయంకరమే! ఊరికే రాజకీయ విమర్శలు చేయటం కాకుండా కేసీఆర్ సెటైర్లతో, ఘాటు పదాలతో గడగడలాడిస్తారు. పాపం ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ కంటే మరెవరికీ బాగా తెలియదు! ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్రా నాయకుల్ని ఏ రేంజ్లో ఏకిపారేసేవారో అలాగే ఇప్పుడు టీ కాంగ్ నేతల్ని చెడుగుడు ఆడుతుంటారు కేసీఆర్. అయితే, రోజూ కేసీఆర్ కాంగ్రెస్ ని టార్గెట్ చేయటం లేదు. అవసరం వచ్చినప్పుడు, ఇక తప్పదనుకున్నప్పుడు దుమ్ము దులుపుతున్నారు. కాని, ఆయన్ని అదే రేంజ్లో కాంగ్రెస్ నేతలు విమర్శించిన దాఖలాలు ఇంత వరకూ లేవు. ఇక ఘాటైన పదాలతో కేసీఆర్ ను తిట్టగలగటం కలలో మాటే!

 

కేసీఆర్ ను తగిన రీతిలో ఎదుర్కోని తెలంగాణ కాంగ్రెస్ కేటీఆర్ ని మాత్రం చెడామడా మాటలు అనేస్తోంది. అదే రేంజ్లో కల్వకుంట్ల తారక రాముడు కూడా తన వాక్కు బాణాలు ఎక్కుపెడుతున్నాడు. తండ్రి లాగే సిగ్గు, శరం వుండాలి లాంటి మాటలు… ఉత్తమ్ కుమార్ని ఉత్తర కుమారుడనటమూ… ఇవన్నీ చేస్తూనే వున్నాడు. అయితే, రాను రాను కేటీఆర్, కాంగ్రెస్ నేతల మధ్య పర్సనల్ వార్ మరీ ఎక్కువైపోతున్నట్టు కనిపిస్తోంది. కేటీఆర్ కాంగ్రెస్ వార్ని పేరు పేరున వ్యక్తిగతంగా తిట్టిపోస్తుంటే అదే భాషలో జవాబిస్తున్నారు టీ కాంగ్ వాళ్లు! తాజాగా కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ అని వెధవ అనే దాకా వెళ్లిపోయారు! ఈ వ్యక్తిగత దూషణల పర్వంలో ఇద్దరిదీ సమాన బాధ్యతనే చెప్పాలి!

 

కేటీఆర్ తో సంబంధాలున్న వారికి డ్రగ్ కేసుతో లింక్ వుందన్న దిగ్విజయ్ కు కూడా స్ట్రాంగ్ రిప్లై తప్పలేదు. కేటీఆర్ ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఘాటు సమాధానం ఇచ్చాడు. దీంతో తమ పార్టీలోని చిన్నా, పెద్దా నాయకులందర్నీ టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్ యువరాజును ఆయన లాంగ్వేజ్ లోనే ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ వారు. కాని, ఇక్కడ విచిత్రం ఏంటంటే… ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా హరీష్ రావు, కవిత, ఆఖరుకు కేసీఆర్ కూడా కనిపించటం, వినిపించటం లేదు. కాంగ్రెస్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లే యుద్దం నడుస్తోంది! సీఎం కుర్చీలో వున్న కేసీఆర్ ని వదిలేసి ఆయన కుమారుడ్ని టార్గెట్ చేయటం వల్ల తెలంగాణ కాంగ్రెస్ ఎలాంటి లాభం పొందుతుందో.. ఎన్నికలు వస్తేగాని తెలియదు!

By
en-us Political News

  
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.