అమరావతికి నో.. సీఆర్డీఏకి యస్..జగన్ వైఖరేంటి? విధానమేంటి?
Publish Date:Jul 20, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో జగన్ మరోసారి మాట మార్చారు. వింత, వితండ వాదనను తెరపైకి తెచ్చారు. తాను రాజథాని అమరావతికి మాత్రమే నోఅన్నాను కానీ, సీఆర్డీయేను వ్యతిరేకించడం లేదంటూ.. రాజథాని విషయంలో తన అయోమయాన్నిగందరగోళాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇటీవల జగన్ ప్రతిపాదించిన మావిగన్ పై ప్రజా క్షేత్రంతో పాటు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. నష్టనివారణకు నడుంబిగించిన జగన్.. సీఆర్డీయేకు సై అంటూ తన గందరగోళాన్ని, స్థిరత్వం లేని విధానాన్ని మరోసారి చాటుకుని నవ్వుల పాలయ్యారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏ పరిధిలోని అంశాన్నేజగన్ ప్రస్తావించారంటూ.. వైసీపీ ఎత్తుకున్న కొత్త భాష్యం ఇప్పుడు నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది. అమరావతిని పక్కన పెట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ మావిగన్ అనే కొత్త రాజధాని ప్రతిపాదనను వైసీపీ అధినేత తరపైకి తెచ్చి వచ్చే ఎన్నికలకు అదే తన నినాదమని ప్రకటించారు. మావిగన్ సు సమర్ధించేవారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓట్లు వేస్తారనీ, జనం ఎవరివైపు ఉన్నారన్నది అప్పుడు తేలిపోతుందని సవాల్ కూడా విసిరారు. అయితే.. మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు. తాజాగా జగన్ సమీప బంధువు, సీనియర్ వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి మావిగన్ ప్రాంతమంతా సీఆర్డీయే పరిధిలోనే ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో జగన్ పై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ఇక రాజధాని అమరాతి విషయంలో జగన్ తీరు పూటకో మాట, రోజుకో తీరు అన్నట్లుగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014-19 మధ్య కాలంలో విపక్షంలో ఉన్న జగన్.. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీశారు. 2024 ఎన్నికలలో మూడు రాజధానులను ఏపీ ప్రజలు ప్రాంతాలకు అతీతంగా నిర్ద్వంద్వంగా తిరస్కరించి.. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతో ఘోర పరాజయాన్ని అందించారు. ఓటమి తరువాత ఇప్పుడు అమరావతి పనులు వాయువేగంతో జరుగుతూ నిర్దుష్ట సమయానికి పూర్తి అవుతాయని అంతా భావిస్తున్న తరుణంలో.. జగన్ మళ్లీ అమరావతిపై విషం చిమ్ముతూ... మావిగన్ రాగం అందుకున్నారు. దానికి జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని గ్రహించగానే.. సీఆర్డీయే కు జై అంటూ మావిగన్ కు కొత్త భాష్యం చెప్పడానికి తరాయరయ్యారు. తాను చెప్పిన మావిగన్ ప్రాంతం అంతా సీఆర్డీయే పరిధిలోనే ఉందంటూ వైసీపీ నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ.. నష్ట నివారణ యత్నాలు చేస్తున్నారు. నిజంగానే జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రాంత మంతా సిఆర్డిఏ పరిధిలోనే ఉంటే.. అది అమరావతే కదా.. కొత్త పేరుతో జనంలో గందరగోళం సృష్టించడమెందుకన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త పేరుతో రాజధాని ప్రతిపాదనలు తెరపైకి తెచ్చి ప్రజల్లో గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. జగన్ ఐదేళ్ల పాలనా కాలంలో..మూడు రాజధానుల జపం తప్ప ఆ దిశగా ఒక్క ఇటుక కూడా పేర్చలేదనీ, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతి పనులను వేగవంతం చేస్తుండటంతో వైసీపీ డిఫెన్స్‌లో పడిందనీ, దీంతో దిక్కు తోచని పరిస్థితుల్లో పడి సీఆర్డీయేకు జై అంటూ కొత్త రాగం ఎత్తుకుని మరో సారి జనంలో గందరగోళం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. AP Capital Issue, Jagan MAVIGUN, Amaravati vs MAVIGUN,, ళP Politics, Capital Controversy, Jagan Change Voice Again, Telugu One
http://www.teluguone.com/news/content/ap-capital-issue-45-226531.html





