కృష్ణా జిల్లా టీడీపీలో... అందరూ హ్యాపీయేనా?

Publish Date:Sep 22, 2016

Advertisement

ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్నాయి. దాంతో నదుల్లో వరదలు పొటెత్తుతున్నాయి. రిజర్వాయర్లు నిండుగా కళకళలాడుతున్నాయి. కాని, అదే సమయంలో హఠాత్తుగా వచ్చి చేరుతున్న కొత్త నీటితో పాత నీరు కొంత అలజడికి గురవుతోంది! ఇప్పుడు కృష్ణా జిల్లా టీడీపి పరిస్థితి కూడా నిండా నిండిన రిజర్వాయర్లా వుంది! కొత్త నీరు, పాత నీటితో కళకళ లాడుతోంది!. టీడీపికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్మాణం, కార్యకర్తలు, నేతలు, బడా నాయకులు వున్నా కృష్ణా జిల్లా ప్రత్యేకం. ఇప్పుడంటే అమరావతి రాజధాని కాబట్టి రాజకీయ వ్యవహారాలు పెరిగాయని అనుకోవచ్చు. కాని, గతంలో కూడా కృష్ణా జిల్లా టీడీపీ పవర్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు మొదలు ఆంధ్రా రాజకీయాల రాజధాని విజయవాడ వరకూ  అన్నీ కృష్ణా జిల్లాలోనే వుండటమే దీనికి కారణం. ఇక విజయవాడ చుట్టూ వుండే నియోజకవర్గాల రాజకీయ చైతన్యం గురించి అందరికీ తెలిసిందే... 

 


2014లో టీడీపీ నవ్యాంధ్ర తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అమరావతి రాజధాని అయింది. దాంతో సీఎం సహా మంత్రులంతా ఇక్కడే వుంటున్నారు. కాబట్టి రాజకీయంగా కీలకంగా మారిన కృష్ణా జిల్లాలో పట్టు సంపాదించటం పై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆ ఎఫెక్టే ఒకప్పటి కీలక నేత దేవినేని నెహ్రు పునరాగమనం! పార్టీ స్థాపించినప్పటి ప్రముఖ నేత అయిన దేవినేని తరువాతి కాలంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయంలో తనదైన రాజకీయం చేశారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తిరిగి స్వంత పార్టీలోకి వచ్చేశారు. ఇది ఆయనకు లాభమే కావొచ్చు కాని... అంతకంటే ఎక్కువగా టీడీపికి లాభం! ఇదే విషయం దేవినేని ప్రత్యర్థులకి బాబు చెప్పరంటున్నాయి టీడీపి వర్గాలు. 

 


దేవినేనికి కృష్ణా జిల్లాలోని ఇతర కీలక నేతలైన వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్ వంటి వారితో పెద్దగా పొసగదు. ఇది బహిరంగ రహస్యమే. అందుకే, దేవినేని వర్గం కొత్త నీరులా వచ్చి పార్టీలో చేరటంతో పాత నీరు లాంటి వల్లభనేని, ప్రసాద్ వర్గాలు కొంత ఆందోళన చెందాయి. అయినా చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి అంతా మౌనంగానే వున్నారు. కాని, దేవినేని పూర్తిస్థాయిలో టీడీపి కండువా కప్పుకునేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభకి మాత్రం నెహ్రు ప్రత్యర్థులు ఎవరు రాలేదు. కాని, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో వున్న నెహ్రుతో విభేదాలు ఓకే. కాని, ఇప్పుడందరూ టీడీపీలోనే వుంటూ ఎడ ముఖం పెడ ముఖంగా వుంటే ఎలా? అందుకే, దేవినేనితో పడని వారిని పిలిపించుకుని బాబు మీటింగ్ పెట్టారట... 

 


దేవినేని కాంగ్రెస్ లోని కీలక నేత. పైగా కృష్ణా జిల్లాలో వైసీపీ కంటే ఇప్పటికీ కాంగ్రెస్సే బలంగా వుంది. కాబట్టి ఆ పార్టీని ఎదుర్కోవటానికి ఒకప్పటి టీడీపీ నేతైన దేవినేని అయితేనే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారట. ఆ క్రమంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను సర్దుకుపోవాలని ఆయన సూచించారట. టీడీపీ వర్గాల సమాచారం మేరకు దేవినేని రాకతో ఇప్పటికే పార్టీలో వున్న పాత నేతలకి, వాళ్ల కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది రాదని సీఎం హామి ఇచ్చారట... దేవినేని చేరికతో పార్టీ లోపల ఏం జరగబోతోందో ముందు ముందు తెలుస్తుంది. కాని, పార్టీ వెలుపల మాత్రం జిల్లాల్లో టీడీపీకి తిరుగులేకుండా పోతుంది. ఇది టీడీపీ అభిమానులకి పెద్ద గుడ్ న్యూసే....  

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.