జగన్ సర్కార్ 1000 డేస్.. ఏమున్నది గర్వకారణం?
Publish Date:Mar 4, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనమోహన్ రెడ్డి పలాంకు వెయ్యి రోజులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా ఆయన వెయ్యి రోజులు పూర్తి చేస్కున్నారు. అయితే, ఈ వెయ్యి రోజుల్లో ఆయన ఏమి చేశారు? ఏమి చేయలేదు, అనే ప్రశ్నలను పక్కన పెడితే,ఇంత ముఖ్యమైన రోజును, వైసీపీలో ఎవరూ, ఎందుకు గుర్తు చేస్కోలేదు. వెయ్యి రోజుల పండగను ఎందుకు జరుపులోలేదు, అనే ప్రశ్నలు అయితే వినిపిస్తునే ఉన్నాయి. నిజానికి, విజయసాయి రెడ్డి ట్వీట్ చేసి గుర్తుచేసే వరకు, అటు ప్రభుత్వంలో కానీ, ఇటు పార్టీలో కానీ, ఎవరూ, ‘వెయ్యి రోజులు’ గుర్తు చేసుకోలేదు. సంబురాలు జరపలేదు. వైసీపీ నేతలు గుర్తు చేసుకున్నా, చేసుకోక పోయినా, ‘వెయ్యి రోజులు’ నిజగానే ఒక మైలు రాయి.అయితే, అదేదో సినిమాలో మహేష్ బాబు, ‘ఎప్పుడు వచ్చాము, అన్నది కాదన్నయ్యా, బులెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యం’ అంటాడు చూడండి, అలాగే, జగన్ రెడ్డి ఎప్పుడు పవర్’లోకి వచ్చారు అనేది ముఖ్యం కాదు, వచ్చి ఏమి చేశారు, అనేదే ముఖ్యం అంటున్నారు సామాన్య జనం. నిజానికి జగన్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో, ‘అప్పులు తేవడం, పందేరాలు చేయడం’ తప్పించి చేసింది లేదు. ఆఫ్కోర్స్, జనం నడ్డి విరిచేలా, ‘చెత్త’ పన్నులు చాలనే వేశారు. విధ్యత్ రవాణా చార్జీలాను మోతెచ్చించారు. అన్నపూర్ణను ఆకలి రాజ్యంగా, అప్పుల కుప్పగా మార్చారు. అందుకే కావచ్చును, ‘జగనన్న పాలనలోఏ మున్నది గర్వ కారణం’ అనుకున్నారో ఏమో వైసీపీ వారెవ్వరూ వెయ్యిరోజుల పండగను పట్టించుకోనే లేదు. చివరకు సాక్షి’లోనూ సింగల్ కాలమ్ ఐటెం వచ్చినట్లు లేదు. అంతేకాదు, నిజాకి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిస్థితి పండగ చేసుకునేలా లేదనే మాట కూడా వినవస్తోంది. ఓ వంక బాబాయ్ మర్డర్ కేసు కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అనే భయం వెంతుతోంది. మరోవంక రాజధాని పిడుగు నెత్తిన పడనే పడింది. ఇక ఆర్థిక పరిస్థితి విషయం అయితే, చెప్పనే అక్కరలేదు. రాజకీయంగా చూసినా, సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పించి చేసిందేమీ లేదన్న అసంతృప్తి పార్టీ నేతలు వ్యక్తపరుస్తున్నారు.నిజానికి, చివరాఖరుకు, సంక్షేమ పథకాలే, సర్కార్ కొంప ముంచుతాయన్న ఆందోళన కూడా ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. కొందరు సీనియర్ నాయకులూ అయితే, పార్టీ పట్టించుకోక పోయినా, జనం మాత్రం జగన్ ప్రభుత్వం రోజులు లెక్కిస్తూనే ఉన్నారని, ఆ రోజు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారని, అంటున్నారు. ప్రజనాడి కూడా అదే చెపుతోంది.
http://www.teluguone.com/news/content/jagan-completes-1000-days-25-132609.html





