స్నీడ్ న్యూస్ 2
Publish Date:Jul 27, 2023
Advertisement
కడెం ప్రాజెక్టుకు భారీగా వరద.. తెరుచుకోని నాలుగు గేట్లు 11.నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం పూర్తి స్థాయి 700 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా.. అందులో నాలుగు గేట్లు తెరుచుకోలేదు. దీంతో 14 గేట్ల ద్వారా వాటికి నీటిని వదులుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే ముంపు తప్పదన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ............................................................................................................................................................... శ్రీశైలం ప్రాజెక్టుకు పోెటెత్తుతున్న వరద
12. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఉదయానికి 816.20 అడుగులకు చేరుకుంది. ............................................................................................................................................................ విశాఖలో భారీ వర్షాలు
13. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం అతలాకుతలమైంది. మున్సిపల్ స్టేడియం, పోర్టుకు వెళ్లే మార్గం జలమయమైంది ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. సమాన్లు నీటిలో కొట్టుకుపోయాయి. ............................................................................................................................................................... సీతారాంపురంలో వరద
14.భద్రాద్రికొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ హార్జా తండా చప్టాపైనుంచి పారుతున్న వరద నీటిలో ఆటో కొట్టుకుపోయింది. ఈ ఆటో నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత సైలెన్సర్ లో కి నీరు పోయి ఆగిపోయింది. ఆటో డ్రైవర్, అందులో ఉన్న ఇద్దరు ప్రయాణీకులు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఆటో మాత్రం కొట్టుకు పోయింది. ................................................................................................................................................... ములుగులో వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
15. ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి ములుగుకు వెడుతున్న బస్సుఈ ఉదయం ములుగు సమీపంలోని గట్టమ్మ జాకారం మధ్యలో భారీ వరద తాకిడికి కొంతదూరం కొట్టుకుపోయి పొలాల మధ్య లో నిలిచిపోయింది. బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ................................................................................................................................................ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం 16. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. పరకాల భూపాలపల్లి మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే హనుమకొండ ఎటురునాగారం ప్రధాని రహదారిపై రాకపెకలు స్తంభించిపోయాయి. ........................................................................................................................................................ భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షం
17. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏడూళ్ల బయ్యారం పెద్దవాగు పొంగి పొర్లడంతో గ్రామంలోకి నీరు చేరింది. వరద నీరు ఊరును ముంచెత్తడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు భయాందోళనకు గురవుతున్నారు. ......................................................................................................................................................... రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల కాలేదు
18.కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు ఆగిపోడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేయకపోవడమే కారణమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా సొమ్ము ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు సాగవని స్పష్టం చేశారు. ............................................................................................................................................................... ఏపీలో భారీ వర్షాలు
19. ఏపీలోని ఆరు జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ........................................................................................................................................... బిగ్ బాస్ కు సెన్సార్
20. బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రసారానికి ముందు సెన్సార్ చేయకపోతే ఎలాగని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నించింది. బిగ్‌బాస్ షో పై తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన రెండుపిల్ లను విచారించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/speed-news-25-159100.html





