కేసీఆర్ కు ఓటమి భయం- కాంగ్రెస్ కు దాసోహం.. విలీనానికి సిద్ధమంటూ ప్రాధేయం?!
Publish Date:Apr 25, 2022
Advertisement
రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి నామమాత్రమే అంటూ తరచూ కాంగ్రెస్ ను చులకన చేస్తూ మాట్లాడే తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు ఆదే కాంగ్రెస్ పార్టీని తెరాసను విలీనం చేయమంటూ ప్రాధేయపడుతున్నారు. రాష్ట్రంలో తెరాస ప్రతిష్ట దెబ్బతిందనీ, ఈ సారి ఎన్నికలలో గట్టెక్కడం సులువు కాదనీ కేసీఆర్ స్వయంగా చేయించిన సర్వేలు తేల్చాయనీ, అలాగే పీకే తన టీమ్ తో చేయించిన సర్వే కూడా అదే విధంగా ఉండటంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించినా, ధాన్యం కొనుగోళ్లపై ఉద్యమాలకు తెరలేపినా ఆశించిన ఫలితం రాకపోవడం, అంతకు ముందు
కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా? గట్టెక్కాలంటే కాంగ్రెస్ కు దాసోహం అనడం తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చారా? వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అదే జరుగుతోందని అనిపించక మానదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను మూడో సారి అధికారంలోకి తీసుకురావాలన్న తన ప్రయత్నాలు ఫలించేలా లేవన్న నిర్ణయానికి వచ్చిన కేసీఆర్... కనీసం ఫేస్ సేవింగ్ గేమ్ తో అయినా కింద పడ్డా పైచేయి అనిపించుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రెండు వారాల కిందట హస్తిన పర్యటనలో ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలో భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమక్షంలో దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ జరిగింది. విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైన ఆ భేటీ వివరాలలో కేసీఆర్ కాంగ్రెస్ కు దాసోహం అన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. బేషరతుగా కాంగ్రెస్ లో తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేయడానికి కేసీఆర్ ప్రతిపాదించారని అంటున్నారు. అయితే కేసీఆర్ ప్రతిపాదనపై సోనియాగాంధీ వెంటనే నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. గతంలో అంటే తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదిస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పి ఆ తరువాత మాట తప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి కేసీఆర్ మాటలను విశ్వసించడం లేదని పరిశీలకులు అంటున్నారు. అందుకే కేసీఆర్ ప్రతిపాదన చేసి దాదాపు పక్షం రోజులు గడుస్తున్నా..ఆ విషయంపై సోనియా స్పందించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్ లో కేసీఆర్, పీకేల మధ్య భేటీ జరిగిందనీ, సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో కేసీఆర్ సోనియా గాంధీ వద్ద చేసిన ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తున్నది. తన ప్రతిపాదనకు సోనియా గాంధీ అంగీకరిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణకు అదనంగా మరో
ఆరు రాష్ట్రాలలో ఫండింగ్ చేయడానికి కూడా కేసీఆర్ ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే తెలంగాణలో సీఎంగా తన కుమారుడు కేటీర్ కు అవకాశం ఇవ్వాలనీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు ఉప ప్రధాని పదవినీ కేసీఆర్ కోరారని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ప్రతిపాదనలపై కాంగ్రెస్ స్పందన ఏమిటన్నతి తెలియాల్సి ఉంది. గతంలో విలీనం పేరు చెప్పి కేసీఆర్ ధోకా ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ప్రతిపాదనపై సోనియా వెంటనే స్పందిచకపోవడంతో ఆమె నిర్ణయం ఏమిటన్నది సస్పెన్స్ గా ఉంది.
కేంద్రంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు ఆశించిన విధంగా ముందుకు సాగకపోవడంతో కేసీఆర్ కాంగ్రెస్ ను శరణుజొచ్చారని చెబుతున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అందుకు తొలి అడుగుగా తాను టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాననీ కేసీఆర్ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. రెండు వారాల నాడు హస్తినలో సోనియాతో చర్చల కొనసాగింపులో భాగంగానే ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారని అంటున్నారు. సోనియా గ్రీన్ సిగ్నల్ ఇస్తే
ఈ ఒప్పందాన్ని ఆచరణలోనికి తీసుకువచ్చేందుకు అవసరమైన కార్యా చరణ ప్రణాళికపై ప్రశాంత్ కిశోర్ కసరత్తు చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్, తెరాస నాయకులకు సీట్లు, పదవుల సద్దుబాట్లు తదితర అంశాలపై ఈ కసరత్తు జరగాల్సి ఉంది. అయితే ఈ విలీనం ప్రతిపాదనకు టి.కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ప్రాంతీయ పార్టీగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఓటమి ఎదురైతే మళ్లీ పుంజుకోవడం కష్టమన్న ఉద్దేశంతోనే...కాంగ్రెస్ లో విలీనం చేసి పరువు దక్కించుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-defeat-fear-praposes-to-merge-trs-into-congress-39-134933.html





