షాకింగ్ న్యూస్.. ఒమిక్రాన్‌పై పనిచేయని కొవిషీల్డ్!.. బూస్టర్ డోస్ మస్ట్!
Publish Date:Apr 25, 2022
Advertisement
అవును, నిజమే. ఒమిక్రాన్‌ను అడ్డుకోవడంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేయట్లేదని తాజా అధ్యయనంలో తేలింది. కొవిషీల్డ్ తీసుకున్న పలువురిపై జరిపిన పరిశోధనల్లో ఆ విషయం వెల్లడైంది. ఆ పరిశీలనలు చేసింది కూడా పుణేలోని ప్రఖ్యాత భారత వైద్య పరిశోధనా మండలి-ఐసీఎంఆర్ కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-ఎన్‌ఐవీ. దీంతో.. కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారంతా ఈ వార్తతో అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే, బూస్టర్ డోస్ తప్పనిసరి అంటున్నారు. ఢిల్లీకి చెందిన ఓ ఆరోగ్య కార్యకర్త (38) టీకా తీసుకోవడానికి ముందు ఒకసారి.. కొవిషీల్డ్ తీసుకున్న తర్వాత రెండుసార్లు కరోనా బారినపడ్డాడని ఎన్ఐవీ శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడంతో పాటు కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారి రోగ నిరోధక వ్యవస్థనూ ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకోగలదని ఈ అధ్యయనంతో నిరూపితమైందని అంటున్నారు. కొవిడ్ టీకా బూస్టర్ డోసును తీసుకోవడం అత్యవసరం అనేందుకు ఇదొక సంకేతమని చెబుతున్నారు. పరిశోధకుల కథనం ప్రకారం.. ఆ ఆరోగ్య కార్యకర్తకు తొలిసారిగా 2020 అక్టోబరు 9న కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏడాది తర్వాత (2021 నవంబరులో) అతడిలో మళ్లీ కొవిడ్ లక్షణాలు కనిపించగా.. పరీక్ష చేయించుకుంటే డెల్టా వేరియంట్ సోకిందని వెల్లడైంది. రెండు నెలల్లోనే మరోసారి కరోనా సోకింది. ఇటీవల 2022 జనవరి 24న ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు తేలింది. టీకా తీసుకున్నా ఇలా వరుసగా కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఆ ఆరోగ్య కార్యకర్త కొవిషీల్డ్ టీకా మొదటి డోసును 2021 జనవరి 31న, రెండో డోసును మార్చి 3న తీసుకున్నాడు. టీకా బూస్టర్ డోసులు ఒమిక్రాన్ వేరియంట్‌పై మెరుగైన రోగ నిరోధక స్పందనను కలిగిస్తున్నందున.. కొవిషీల్డ్ తీసుకున్న వారు మూడో డోస్ తీసుకొని.. తగినంత రక్షణ పొందవచ్చని పరిశోధకులు సూచించారు. ఈమేరకు ఆ అధ్యయన నివేదిక ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’లో పబ్లిష్ అయింది.
http://www.teluguone.com/news/content/less-effect-of-covishield-on-omicron-39-134930.html





