రేవంత్ పేరెత్తకుండానే కేసీఆర్ ప్రసంగం.. వ్యూహాత్మకమేనా?

Publish Date:Apr 28, 2025

Advertisement

తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన  ఎన్నికలలో  పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత  బీఆర్ఎస్ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ సభ ఏదైనా ఉందంటే... అది ఆదివారం వరంగల్ వేదికగా జరిగిన రజతోత్సవ సభ మాత్రమే. బీఆర్ఎస్ ఆవిర్భవించి పాతికేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీ జరుపుకున్న రజతోత్సవ సభకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. పార్టీ పరాజయం తరువాత కేసీఆర్ పాల్గొన్న భారీ బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం. అంతకు ముందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నా.. వాటికి ఇంతటి హైపూ లేదూ, జనమూ పట్టించుకోలేదు.

కానీ బీఆర్ఎస్ (టీఅర్ఎస్) అవిర్భవించి పాతికేళ్లు పూర్తి అయిన  సందర్భంగా జరిగిన ఈ బహిరంగ సభలో కేసీఆర్ దాదాపు గంట సేపు ప్రసంగించారు.  ఈ ప్రసంగం మొత్తం వ్యూహాత్మకంగా సాగింది.   అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో కేసీఆర్ ఇంత సుదీర్ఘ ప్రసంగం చేసిన సందర్భం లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రచార సభలలో ఒకటి రెండు సార్లు ప్రసంగించినా ఆ ప్రసంగాలన్నీ చప్పగా సాగాయి. క్లుప్తంగా ప్రసంగాన్ని ముగించేశారు.  

అన్నిటి కంటే చెప్పుకోవలసిన విషయమేంటంటే గంట సేపు ప్రసంగంలో కేసీఆర్ ఒక్కటంటే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావంచలేదు. అయితే ప్రసంగం మొత్తం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విధ్వంసకరంగా ఉందని విమర్శలు గుప్పించారు.  రేవంత్ సర్కార్ టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగం సాగినా రేవంత్ పేరు మాత్రం ఆయన నోటి వెంట రాలేదు. గతంలో కూడా రేవంత్ పేరు ప్రస్తావించడానికి కానీ, ఆయనను అసెంబ్లీలో చూడడానికి కానీ కేసీఆర్ ఇష్టపడలేదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.  

ఇప్పుడు కూడా ఆయన తన నోటి వెంట రేవంత్ పేరు ఉచ్ఛరించలేదు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరు కావడానికి కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటమే కారణమని కూడా పార్టీ వర్గాలు చెబుతుంటాయి. రేవంత్ నుఅందుకే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారని అంటారు.  ఇప్పుడు ఆయన తాజా ప్రసంగంలో కూడా వ్యూహాత్మకంగా రేవంత్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన పాలనను తూర్పారపట్టారు.   

By
en-us Political News

  
కడపలో తెలుగుదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పసుపు పండుగ మహానాడులో కీలక నిర్ణయాలు వెలువడుతాయన్న సంకేతాలు వినవస్తున్నాయి.
భారత్‌కు ట్రంప్ యాపిల్‌తో స్ట్రోక్‌లు ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యాపిల్‌ తయారీ ప్లాంట్లు తరలివస్తాయని ఆశలు పెట్టుకొన్న భారత్‌కు నిరాశే మిగిలేట్లు ఉంది.
మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.
హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఒక రౌడీ షీటర్‌ను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
కడప మహానాడులో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అందులో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న ప్రచారం జోరందుకుంది.
ఆపరేషన్ సిందూర్ భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీని ఈనెల మే 16న విజయవాడలో నిర్వ‌హించాల‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వ‌రి నిర్ణ‌యించారు.
వైసీపీ అధినేత జగన్‌కు సొంత జిల్లాలో భారీ షాక్ తగిలింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గతకొద్ది కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపారు.
జగన్ ఇలాకా కడప జిల్లాలో పసుపు దళం పార్టీ పండుగ చేసుకోనుండటం హాట్ టాపిక్‌గా మారింది. కడపలో టీడీపీ మహానాడు మూడు రోజుల పాటు నిర్వహించడానికి నిర్ణయించింది. 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి మహానాడుకు కడప వేదిక అవ్వడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది.
ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారి పోటీ చేసే వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తిరిగి సెగ్మెంట్ మారేందుకు కసరత్తు మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో గెలుపొందిన యర్రగొండపాలెం నియోజకవర్గానికి తిరిగి వెళ్లేందుకు ఆయన తెర వెనుక రాజకీయాలు మొదలుపెట్టారంట.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా గడిచిన ఐదేళ్ల కాలంలో తన హవా చాటిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, తన సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే గా ఉండగా.. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీలను శాసించేవారు.
ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.