డబ్బులు వాళ్లకి.. జబ్బులు జనాలకి

Publish Date:Apr 28, 2025

Advertisement

ప్రజలను పీల్చి పిప్పి చేసిన జే బ్రాండ్  లిక్కర్
పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఊరుపేరు లేని బ్రాండ్లు
ధనదాహంతో విషం అమ్మి సొమ్ము చేసుకున్ననాటి పాలకులు 
బయట పడుతున్న నిజాలు- ఉలికి పడుతున్న నేతలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4 గా నమోదు అయిన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సీఐడీ అధికారులు విచారించారు. తర్వలో మరోసారి విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు. మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామిని కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు. అయన జగన్ ప్రభుత్వలో ఐదు సంవత్సరాల పాటు ఎక్సెజ్ శాఖను నిర్వహించారు. వారితో పాటు గాలివీడు కు చెందిన ఎక్సెజ్ ఉన్నతాధికారి అయిన సత్య ప్రసాద్ కూడా  లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అల్టిమేట్ టార్గెట్ జగనే అవుతారన్న భయం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

వైసీపీ పాలనలో నాసిరకం మద్యం విక్రయాలు పేదల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. మద్యం కారణంగా లివర్, కిడ్నీ, మెదడు సంబంధిత న్యూరో వ్యాధులతో ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య ఆ అయిదేళ్లలో ఏటా పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు ద్వారా ఆసుపత్రుల్లో ఇన్‌పేషంట్లుగా చేరి ఉచిత చికిత్స పొందినవారి గణాంకాలు.. నాసిరకం మద్యం తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. వీరు కాకుండా సొంత ఖర్చులతో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన, పొందుతున్నవారు భారీ సంఖ్యలో ఉన్నారు.

రాష్ట్రంలోని పది రకాల వ్యాధుల అధ్యయన వివరాలను ఇటీవల వెల్లడించిన సీఎం చంద్రబాబు.. అందుకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించి నియంత్రణ చర్యలను చేపట్టాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. మద్యం ప్రభావిత వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లలో మద్యం ప్రభావిత జబ్బులతో చికిత్స పొందినవారి వివరాలను ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు సేకరించింది. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తాగినవారి ఆరోగ్యాలు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించింది. 

28 రోగాలకు మద్యం కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఆక్స్‌ఫర్డ్‌ పాపులేషన్‌ హెల్త్, పెకింగ్‌ విశ్వవిద్యాలయం కూడా సుదీర్ఘకాలంపాటు ఐదు లక్షల మంది మద్యం బాధితుల ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసింది. 61 రోగాలకు ప్రత్యక్షంగా, 206 జబ్బులకు పరోక్షంగా మద్యమే కారణమవుతోందని ఈ సంస్థలు వెల్లడించాయి. నాసిరకం మద్యం ప్రభావం మరింత ఎక్కువే ఉంటుంది.  వైసీపీ పాలనలో ఓ మాదిరి తాగే అలవాటున్న వారికీ నాలుగేళ్లలోనే కాలేయం చెడిపోయిన సంఘటనలు నమోదయ్యాయి. బాధితుల్లో అత్యధికులు బడుగు, బలహీనవర్గాలవారే. నెలల వ్యవధిలోనే వారి ఆరోగ్యం క్షీణించింది. వీరి వయసు 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉందని లెక్కలు చెప్పుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల 2020-21లో మద్యం దుష్పలితాల ప్రభావం కాస్త తగ్గింది. మద్యం విక్రయాలు తగ్గడమే దీనికి కారణమన్న విశ్లేషణలున్నాయి.
 వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన లిక్కర్‌ స్కాం లాంటిది దేశంలో మరెక్కడా జరగలేదంటున్నారు. వైసీపీ నాయకులు తయారు చేయించిన నాసిరకం కల్తీ మద్యంతో లక్షలాదిమంది అనారోగ్యం పాలయ్యారు. వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయా జిల్లాల్లో విక్రయించిన బ్రాండ్లను బట్టి వాటి ప్రభావం బాధితులపై పడింది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలు లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తుల్లో తొలి 5 స్థానాల్లో నిలిచాయి. 

నెల్లూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో మెదడు సంబంధిత న్యూరో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా కిడ్నీ కేసులు నమోదయ్యాయి. 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు ద్వారా ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కిడ్నీ బాధితుల సంఖ్య 49 వేలుగా ఉంటే 2019-24 మధ్య కాలంలో వారి సంఖ్య 91 వేలకు చేరడం గమనార్హం. ఈ గణాంకాలు చూసి విస్తుపోయిన సీఎం  చంద్రబాబు బాధితులను ఆదుకోవడానికి వైద్య విభాగాలను అలర్ట్ చేయాల్సి వస్తోందిప్పుడు.

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవలకు తోడు వారాంతంం కూడా కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు ఫేస్ బుక్ పోస్టు ఒక తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలు, విమర్శలపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారనీ, జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆ కౌంటర్ ఉంటుందనీ అంతా భావించారు. అయితే జగన్ విమర్శలకు విజయసాయి రెడ్డి కంటే ముందు.. ఎవరూ ఊహించని విధంగా, దివంగత తారకరత్న సతీమణి అలేఖ్య నుంచి స్పందన వచ్చింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో సారి అస్వస్థతకు గురయ్యారు. బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి ఆయన్ను విచారణ నిమిత్తం విజయవాడ జిల్లా జైలు నుంచి కంకిపాడు పోలీసులు శుక్రవారం (మే 23) కస్టడీలోకి తీసుకున్నారు.
నా తండ్రికి ఉత్తరం రాసిన మాట వాస్తవమే. కానీ అది రెండు వారాల క్రితమే రాశాను. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలను ఇప్పటికే అనేకసార్లు చెప్పాని కవిత క్లారిటీ ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలు తమకు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు
కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు.
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని డాక్టర్‌కు కరోనా పాజిటివ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్నిముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్ చాలాకాలం తర్వాత అమరావతి రాజధానిపై విచిత్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే తిరిగి గుప్పించారు.
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణని నియమించారు.
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని హైదరాబాద్ సీపీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్తరం రాయించారేమోనని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.