పిట్టల దొరసాని వచ్చింది...కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్ సెటైర్లు
Publish Date:Apr 25, 2026
Advertisement
ఇన్నాళ్లూ పిట్టలదొర క్యారెక్టర్ చూశాం.. ఇకపై పిట్టల దొరసాని వేషము చూడాలి అర్వింద్ సెటైర్లు తెలంగాణ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో స్పందించింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసింది. కవిత ప్రకటించిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనపై అధికార కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది. బీఆర్ఎస్ తోక పార్టీనే కవితక్క ప్రారంభించిన ఈ కొత్త పార్టీ (తెలంగాణ రాష్ట్ర సేన) అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ట్వీట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. తలా తోక ఎప్పటికీ ఒక్కటేనని బాపు బీఆర్ఎస్ అంతర్భాగమే తనయ టీఆర్ఎస్.. అంతా గ్యాస్ అంటూ సెటైర్ వేశారు. మరోవైపు, రాష్ట్ర బీజేపీ నాయకుడు రాంచందర్ రావు మాట్లాడుతూ, ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా, రాష్ట్రంలో బీజేపీని ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.బీఆర్ఎస్ నుండి పుట్టినదే టీఆర్ఎస్ అని రాంచందర్ రావు ఆరోపించారు. కవిత ప్రారంభించబోయే కొత్త పార్టీ రాజకీయ అస్తిత్వంపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమేనని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం కవిత తన రాజకీయ ప్రస్థానంలో తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఉన్న ప్రధాన పార్టీల మధ్య, కవిత కొత్త పార్టీ తన ప్రభావాన్ని ఎలా చూపుతుందో వేచి చూడాల్సిందే.ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు దీన్ని కేవలం ఒక రాజకీయ వ్యూహంగా చూస్తారా లేక ఆదరిస్తారా అనేది భవిష్యత్తులో తేలనుంది.
బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్, కవితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవితను తాము ఎప్పుడో మర్చిపోయామని, ఇప్పుడు మళ్లీ ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఆమె తీసుకున్న నిర్ణయం ఆసక్తికరమైన రాజకీయ చర్చలకు దారితీసింది.గతంలో కవితపై 'పిట్టలదొర' అని విమర్శించిన అర్వింద్, ఇప్పుడు ఆమె కొత్త పార్టీ ఏర్పాటును ఉద్దేశించి 'పిట్టల దొరసాని' పాత్రను పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆమె ఇంకా టీఆర్ఎస్ హ్యాంగోవర్‌లోనే బతుకుతున్నారని, వాస్తవాలను గుర్తించడం లేదని ఆయన విమర్శించారు.
http://www.teluguone.com/news/content/kavitha-36-218231.html





